కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు(Supreme Court) నుంచి ఎదురు దెబ్బ తగిలింది. ఈడీ(ED) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా(Sanjay Kumar Mishra) పదవీకాలం పొడిగింపు చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న పనులు క్లియర్ చేయడానికి సుప్రీం కోర్టు ఆయ‌న‌కు జూలై 31, 2023 వరకు సమయం ఇచ్చింది.

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు(Supreme Court) నుంచి ఎదురు దెబ్బ తగిలింది. ఈడీ(ED) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా(Sanjay Kumar Mishra) పదవీకాలం పొడిగింపు చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న పనులు క్లియర్ చేయడానికి సుప్రీం కోర్టు ఆయ‌న‌కు జూలై 31, 2023 వరకు సమయం ఇచ్చింది. జస్టిస్ బిఆర్ గవాయ్(BR Gawai), జస్టిస్ విక్రమ్ నాథ్(Vikramnath), జస్టిస్ సంజయ్ కరోల్‌లతో(Sanjay carols) కూడిన ధర్మాసనం.. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్(Delhi Special Special Police Establishment)చట్టంలో సవరణలు చేసి ఈడీ డైరెక్టర్ పదవీకాలాన్ని గరిష్టంగా ఐదేళ్ల వరకు పొడిగించాలని కోరింది. ప్రభుత్వం చట్టం చేసి పదవీకాలాన్ని పొడిగించవచ్చని, అయితే ఆర్డినెన్స్ తీసుకురావడం చెల్లదని కోర్టు పేర్కొంది.

2018 నవంబర్‌లో రెండేళ్ల స‌ద‌వీకాల‌నికి గానూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్‌గా సంజయ్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు. 2020లో కేంద్ర ప్రభుత్వం ఆయ‌న‌కు ఒక సంవత్సరం పొడిగింపు ఇచ్చింది. ఆ తర్వాత 2021లో పదవీకాలం ముగియడానికి ఒకరోజు ముందు మళ్లీ సర్వీస్ పొడిగింపు ఇచ్చింది. రెండవ సర్వీస్ పొడిగింపు నవంబర్ 17, 2022 న ముగియడానికి ముందే.. క్యాబినెట్ నియామకాల కమిటీ.. మూడవ సర్వీస్ పొడిగింపును ఒక సంవత్సరం (నవంబర్ 18, 2022 నుండి నవంబర్ 18, 2023 వరకు) ఆమోదించింది. ఈ క్ర‌మంలోనే ఈడీ, సీబీఐ డైరెక్టర్ల పదవీకాలాన్ని రెండేళ్ల తప్పనిసరి వ్యవధి తర్వాత మూడేళ్లపాటు పొడిగించేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం గతేడాది ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది.

డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పదవీకాలాన్ని పొడిగించడాన్ని సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్‌లు ఆయ‌న‌ సర్వీసు పొడిగింపు చట్టవిరుద్ధంగా జరిగిందని పేర్కొన్నారు. అంత‌కుముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పదవీకాలం పొడిగింపును సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్‌లపై తీర్పును మే 8న సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.

మే 8న విచారణ సందర్భంగా కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. సంజయ్ కుమార్ మిశ్రా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కాదని, అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని కోర్టుకు తెలియజేశారు. అందుకే పార్లమెంట్‌ సామరస్యపూర్వక నిర్ణయం తీసుకుంది. సంజయ్ కుమార్ మిశ్రా నవంబర్ లో పదవీ విరమణ చేయనున్నట్లు మెహతా కోర్టుకు తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ ఎస్‌కె మిశ్రా మూడవసారి పదవీకాలం పొడిగించిన కేంద్రం ప్రభుత్వం నిర్ణయాన్ని.. 17 నవంబర్ 2022న సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లను కోర్టు విచారిస్తోంది.

సంజయ్ మిశ్రా ఆదాయపు పన్ను కేడర్‌కు చెందిన 1984-బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారి. ఈడీలో ప్రిన్సిపల్ స్పెషల్ డైరెక్టర్‌గా నియమించారు. ఈడీలో నియామకం కాకముందు సంజయ్ మిశ్రా ఢిల్లీలో ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమిషనర్‌గా పనిచేశారు.

Updated On 11 July 2023 6:20 AM GMT
Ehatv

Ehatv

Next Story