ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమేనని చెప్పింది.

ఎస్సీ(SC), ఎస్టీ(ST) వర్గీకరణపై సుప్రీంకోర్టు(Supreme Court) చారిత్రక తీర్పు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమేనని చెప్పింది. రిజర్వేషన్ల(Reservation)పై 6:1 మెజారిటీతో సీజేఐ చంద్రచూడ్‌(CJI Chandrachud) ధర్మాసనం తీర్పు ఇచ్చింది.విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈ క్రమంలో గతంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఈ తీర్పులో.. ఏడుగురు న్యాయమూర్తుల్లో ఒక్క జస్టిస్‌ బేలా త్రివేది(Justice Bela Trivedi) మాత్రం విరుద్ధమై


న తీర్పును ఇచ్చారు. ఉపవర్గీకరణ సాధ్యం కాదని బేలా త్రివేది తన తీర్పులో పేర్కొన్నారు. దీంతో 6-1 తేడాతో తుది తీర్పు వెలువడింది.

ehatv

ehatv

Next Story