ఢిల్లీ ప్రభుత్వం(Delhi Govt)పై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్(Ordinance)కు వ్యతిరేకంగా కేజ్రీవాల్(Kejriwal)చేస్తున్న పోరాటం సుప్రీంకోర్టు(Supreme Court)కు చేరింది. ఢిల్లీ ప్రభుత్వ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు జూలై 10న విచారించనుంది. కేంద్రం ఆర్డినెన్స్‌ను విడుదల చేసిన వెంటనే.. దానిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తామని ఢిల్లీ ప్రభుత్వం చెప్పింది.
ఢిల్లీ ప్రభుత్వం(Delhi Govt)పై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్(Ordinance)కు వ్యతిరేకంగా కేజ్రీవాల్(Kejriwal)చేస్తున్న పోరాటం సుప్రీంకోర్టు(Supreme Court)కు చేరింది. ఢిల్లీ ప్రభుత్వ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. కేంద్ర ఆర్డినెన్స్(Centre's ordinance)కు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు జూలై 10న విచారించనుంది. కేంద్రం ఆర్డినెన్స్‌ను విడుదల చేసిన వెంటనే.. దానిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తామని ఢిల్లీ ప్రభుత్వం చెప్పింది.
కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ ప్రకారం.. ఢిల్లీలో అధికారుల బదిలీ, పోస్టింగ్‌కు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే హక్కు లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఇవ్వబడింది. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (National Capital Territory of Delhi)(సవరణ) ఆర్డినెన్స్ 2023 ప్రకారం.. ఢిల్లీలో పనిచేస్తున్న DANICS కేడర్‌కు చెందిన గ్రూప్ A అధికారులపై బదిలీ, క్రమశిక్షణా చర్యల కోసం నేషనల్ క్యాపిటల్ పబ్లిక్ సర్వీస్ అథారిటీ(National Capital Public Service Authority)ని ఏర్పాటు చేస్తారు. ఈ అథారిటీలో ముగ్గురు సభ్యులు ఉంటారు. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ చీఫ్ సెక్రటరీ, ఢిల్లీ హోం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. ఈ అథారిటీకి ఢిల్లీ ముఖ్యమంత్రిని చైర్మన్‌గా నియమించారు. అయితే, అధికారుల బదిలీ, పోస్టింగ్ లో మాత్రం తుది నిర్ణయం లెఫ్టినెంట్ గవర్నర్ దే ఉంటుంది.
అంతకుమేందు సుప్రీంకోర్టు మే 11న ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుని.. ఢిల్లీ ప్రభుత్వం మాత్రమే ఢిల్లీలోని బ్యూరోక్రాట్‌లను బదిలీ చేయగలదని.. పోస్ట్ చేయగలదని స్పష్టం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీం కోర్టు నిర్ణయాన్ని తమ విజయంగా ప్రకటించింది. అయితే కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) ఆర్డినెన్స్-2023 తీసుకురావడంతో వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు.