మోదీ ఇంటిపేరు(Modi Surname)వ్యాఖ్యల‌కు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court) శుక్రవారం విచారణ చేపట్టింది. రాహుల్ గాంధీ పిటిషన్‌పై గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీకి(Purnesh Modi) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పరువు నష్టం కేసులో గుజరాత్ ప్ర‌భుత్వానికి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.

మోదీ ఇంటిపేరు(Modi Surname)వ్యాఖ్యల‌కు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court) శుక్రవారం విచారణ చేపట్టింది. రాహుల్ గాంధీ పిటిషన్‌పై గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీకి(Purnesh Modi) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పరువు నష్టం కేసులో గుజరాత్ ప్ర‌భుత్వానికి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసుల‌కు సమాధానం ఇవ్వడానికి పూర్ణేష్ మోదీ కోర్టును 21 రోజుల స‌మ‌యం కోరగా.. కోర్టు ఆయ‌న‌కు 10 రోజుల సమయం ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 4న జరగనుంది. రాహుల్ గాంధీకి విధించిన శిక్షపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

రాహుల్‌ను దోషిగా నిర్ధారించిన కోర్టు.. శిక్షపై స్టే ఇవ్వడానికి నిరాకరించి.. మూడుసార్లు తప్పు చేసిన‌ట్లు రాహుల్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని ఎలాంటి నష్టం జరిగినా అరికట్టాల‌ని కోరారు. రాహుల్‌ శిక్షపై స్టే విధించకపోతే.. ఆయ‌న‌ కెరీర్‌లో ముఖ్య‌మైన‌ ఎనిమిదేళ్లు కోల్పోయే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. హైకోర్టు తీర్పుపై స్టే విధించకపోతే.. ప్రజాస్వామ్య సంస్థలను క్రమపద్ధతిలో నిర్వీర్యం చేసేందుకు పదే పదే జరుగుతున్న ప్రయత్నాలను ప్రోత్సహిస్తున్నట్లేన‌ని రాహుల్ పిటీషన్‌లో పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఊపిరి పోస్తుందని.. ఇలాంటి వాతావరణం భారతదేశ రాజకీయాల‌కు హానికరం అని పేర్కొన్నారు.

Updated On 21 July 2023 2:57 AM GMT
Ehatv

Ehatv

Next Story