Supreme court On Fibernet Case : అప్పటివరకూ చంద్రబాబును అరెస్ట్ చేయొద్దు
ఫైబర్ నెట్ కేసులో(Fiber Net Case) టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(chandrababu) ముందస్తు బెయిల్ పిటీషన్(Anticeptory bail) వాయిదా పడింది. చంద్రబాబు పిటీషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో(supreme court) విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. తదుపరి విచారణ నిమిత్తం ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. అలాగే.. ఈ నెల 30వ తేదీ వరకూ చంద్రబాబును అరెస్ట్ చేయవద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొంది.
ఫైబర్ నెట్ కేసులో(Fiber Net Case) టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(chandrababu) ముందస్తు బెయిల్ పిటీషన్(Anticipatory bail) వాయిదా పడింది. చంద్రబాబు పిటీషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో(supreme court) విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. తదుపరి విచారణ నిమిత్తం ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. అలాగే.. ఈ నెల 30వ తేదీ వరకూ చంద్రబాబును అరెస్ట్ చేయవద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. ఈ కేసులో హైకోర్టు(High court) బెయిల్ ను తిరస్కరించడంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును సీఐడీ నిందితుడిగా చేర్చింది. ఫైబర్ నెట్ స్కామ్ వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని సీఐడీ పేర్కొంది.
ఇదిలావుంటే.. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో జైలు నుంచి విడుదలైన చంద్రబాబు మధ్యంతర బెయిల్ ఈ నెల 28వ తేదీతో ముగియనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలలోపు ఆయన రాజమండ్రి కేంద్ర కారాగారం వద్ద లొంగిపోవాల్సి ఉంటుంది.