సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) అప్పుడప్పుడు రాజకీయాలపై మాట్లాడుతుంటారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) అప్పుడప్పుడు రాజకీయాలపై మాట్లాడుతుంటారు. తాజగా తమిళ రాజకీయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. డీఎంకే పార్టీ(DMK) మర్రి చెట్టులాంటిదని, ఎలాంటి తుఫాన్‌కైనా ఎదురొడ్డి నిలుస్తుందని రజనీకాంత్ వ్యాఖ్యానించడం సంచనలం రేపుతోంది. ఓ పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ రజనీ ఈ వ్యాఖ్యలు చేశారు. నిజానికి రజనీకాంత్ కాజువల్‌గానే ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ హీరో విజయ్ ఫ్యాన్స్(Hero Vijay Fans) మాత్రం ఫీలవుతున్నారు. ఇవి దళపతి(Vijay Thalapathy) విజయ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలేనని అంటున్నారు. విజయ్ సొంతంగా పార్టీ పెట్టిన సంగతి, ఇటీవల జెండాను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అందుకే రజనీకాంత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన వ్యాఖ్యలపై రజనీకాంత్ వివరణ ఇస్తారో లేదో చూడాలి. గతంలో రజినీకాంత్ పార్టీ పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసి, తర్వాత ఓ రకమైన భయంతో ఆ ప్రపోజల్స్‌కు దూరం పెట్టారు. రజినీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా పరోక్షంగా డీఎంకే పార్టీకి దగ్గరగా ఉంటున్నారనే ముచ్చట తమిళనాడులో బలంగా వినిపిస్తోంది. రజనీ ఫ్యాన్స్‌కు, విజయ్ ఫ్యాన్స్‌కు అసలు పడదు. సూపర్‌స్టార్ హోదా విషయంపై తరచూ ఈ ఇద్దరు నటుల అభిమానులు తగవులాడుకుంటుంటారు.