తమిళనాడులో(Tamilnadu) రాజకీయపార్టీలకు కొదవలేదు. ముఖ్యంగా సినిమావాళ్లు చాలామంది సొంతంగా పార్టీలు పెట్టుకున్నారు. కొన్నేమో మఖలో పుట్టి పుబ్బలో మాడిపోయినవి, కొన్నేమో ఉన్నాయంటే ఉన్నాయనిపించుకునేవి! తమిళనాడులో రాజకీయాలకు, సినిమారంగానికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఎంజీఆర్‌(MGR) వంటి స్టార్‌ హీరో మాత్రమే పాలిటిక్స్‌లో సక్సెస్‌ కాగలిగారు. శివాజీగణేషన్‌(shivaji ganeshan) సొంతంగా పార్టీ పెట్టుకుని చేతులు కాల్చుకున్నారు. ఇటీవల చనిపోయిన విజయ్‌కాంత్‌(Vijaykanth) కాసింత నయం.

తమిళనాడులో(Tamilnadu) రాజకీయపార్టీలకు కొదవలేదు. ముఖ్యంగా సినిమావాళ్లు చాలామంది సొంతంగా పార్టీలు పెట్టుకున్నారు. కొన్నేమో మఖలో పుట్టి పుబ్బలో మాడిపోయినవి, కొన్నేమో ఉన్నాయంటే ఉన్నాయనిపించుకునేవి! తమిళనాడులో రాజకీయాలకు, సినిమారంగానికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఎంజీఆర్‌(MGR) వంటి స్టార్‌ హీరో మాత్రమే పాలిటిక్స్‌లో సక్సెస్‌ కాగలిగారు. శివాజీగణేషన్‌(shivaji ganeshan) సొంతంగా పార్టీ పెట్టుకుని చేతులు కాల్చుకున్నారు. ఇటీవల చనిపోయిన విజయ్‌కాంత్‌(Vijaykanth) కాసింత నయం. ఇక సూపర్‌స్టార్‌ హోదా తెచ్చుకున్న రజనీకాంత్‌(Rajinikanth) పార్టీ పెట్టడానికి సాహసించలేదు. కమలహాసన్‌(Kamal Haasan) పార్టీ పెట్టారు కానీ ఇప్పటి వరకైతే సక్సెస్‌ కాలేదు. ప్రస్తుతం సూపర్‌స్టార్‌గా ఫ్యాన్స్‌ పిల్చుకుంటున్న విజయ్‌ కూడా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇలయ దళపతిగా(Ilaya Dalapati) పేరుగాంచిన విజయ్‌ తర్వలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్‌గా జరిగిన విజయ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌(Vijay People Moment) జనరల్‌ బాడీ సమావేశంలో విజయ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారట! సభ్యులు రాజకీయ పార్టీ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారట! సినిమాల్లో ఉంటూనే విజయ్‌ పలు సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంటారు.

ఇటీవల వరద బాధితులకు స్వయంగా ఆయనే నిత్యావసరాలు అందించారు. తమిళనాడులో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో 10, 12 తరగతుల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు లాస్టియర్‌ జూన్‌లో నీలాంగరైలో ప్రశంసాపత్రాలు, ప్రోత్సాహక బహుమతులు ఇచ్చారు. విజయ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ తరఫున గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల కోసం రాత్రి పాఠశాలలు ప్రారంభించారు. గ్రంథాలయాలను(Library) ఏర్పాటు చేశారు. అసలు రెండేళ్ల కిందటే విజయ్‌ పార్టీ పెడుతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఏమైందో తెలియదు కానీ ఆ ప్రతిపాదన ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టాలని విజయ్‌ స్థిర నిర్ణయం తీసుకున్నారు. గురువారం చెన్నై దగ్గర ఉన్న పనయూర్‌లోని తన కార్యాలయంలో మక్కల్‌ ఇయక్కం నిర్వాహకులతో విజయ్‌ సమావేశాన్ని నిర్వహించారు. చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చి, మదురైతో పాటు అన్ని జిల్లాల నుంచి 150 మంది నిర్వాహకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాజకీయ పార్టీ ప్రారంభించాలని సమావేశంలో పలువురు డిమాండు చేశారు. మరో నెలరోజుల్లో పార్టీని విజయ్‌ ప్రకటించబోతున్నారని తెలిసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా? లేకపోతే ఏ పార్టీకైనా మద్దతు ఇవ్వాలా? అన్నది అప్పుడు నిర్ణయిస్తారని తెలిసింది.

Updated On 26 Jan 2024 1:16 AM GMT
Ehatv

Ehatv

Next Story