ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తమిళ రాజకీయాలు ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతుంటాయి. సినీ ఫీల్డ్‌ నుంచి వచ్చినవారే తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్నారు. తమిళనాడులోని రాజకీయ పార్టీలు రెండు ప్రధాన పార్టీలు ద్రవిడ మున్నేట్ర కజగం (DMK), ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీలదే (AIDMK) పైస్థాయి. ఆ తర్వాత పులువురు సినీ స్టార్లు పార్టీలు స్థాపించినా సక్సెస్‌ కాలేకపోయారు. రజినీకాంత్, కమల్‌హాసన్‌లాంటి నటులు పార్టీలు స్థాపించినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. రజినీకాంత్ పార్టీని ప్రకటించినప్పటికీ ఎన్నికల వరకు తీసుకెళ్లలేకపోయారు. తాజాగా కోలీవుడ్‌ సూపర్‌స్టార్‌ దళపతి విజయ్‌ రాజకీయ పార్టీని స్థాపించారు. ఎనిమిది నెలల కిందట తమిళగ వెట్రి కళగం అనే పార్టీని పెట్టిన విజయ్‌ మరో రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తలపడటానికి రెడీ అవుతున్నాడు. ఇందులో భాగంగానే మొన్నపార్టీ తొలి మహానాడు సభను నిర్వహించారు. అది సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ అయ్యింది. 2026 ఎన్నికల వరకు బలమైన పార్టీగా తయారు చేసుకోవాలని విజయ్‌ ప్రణాళికలు రచిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ సారి త్రిక్కోణపు పోటీ నెలకొందే అవకాశం ఉంది. ఏఐడీఎంకే అగ్రనేత జయలలిత(Jayalalitha) మరణంతో ఆ పార్టీని నడిపించే నాయకులు లేకపోవడంతో ఆ గ్యాప్‌ను వాడుకోవాలని విజయ్‌ చూస్తున్నారు. ఇదే సమయంలో మరోసారి తమిళనాడు(Tamilnadu)లో డీఎంకే జెండా ఎగరవేయాలని వ్యూహం రచిస్తోంది. ఇందుకుగాను ఎన్ని అవకాశాలు ఉన్నా వదులుకోవడం లేదు. ఈ సారి ఎన్నికల్లో తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌(Rajinikanth)ను వాడుకోవాలని చూస్తోందట. గతంలో ఓ కార్యక్రమంలో రజినీకాంత్ స్టాలిన్‌ పరిపాలన పట్ల ప్రశంసలు కూడా కురిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. పొరుగు రాష్ట్రాల్లో రాజకీయ వారసులు తమ పూర్వీకులు స్థాపించిన పార్టీలను నడపడానికి కష్టపడుతున్నారు, చాలా మంది విఫలమయ్యారు. కానీ తమిళనాడులో మాత్రం స్టాలిన్(Stalin) పార్టీని విజయవంతంగా నడపగలిగారు' అని రజనీకాంత్ ప్రశంసించారు. డీఎంకేతో సన్నిహితంగా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో రజినీకాంత్‌ను ఈ ఎన్నికల్లో డీఎంకే తరపున ప్రచారం చేయించాలని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు.

ehatv

ehatv

Next Story