ఇవాళ, అంటే ఆగస్టు 30 బుధవారం ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. చాలా అరుదుగా వచ్చే సూపర్ బ్లూ మూన్(Super Blue Moon) కనువిందు చేయబోతున్నది. ఇది ప్రత్యేకమైన పున్నమి. అన్ని పున్నమి రోజుల్లో కాకుండా ఇవాళ చంద్రుడు చాలా పెద్దగా, కాంతివంతంగా కనిపిస్తాడు. చంద్రుడు భూమికి(Earth) అత్యంత సమీపంలోకి రాబోతున్నాడు. అంటే భూమికి 3.57,244 కిలోమీటర్ల దూరంలో చంద్రుడు రాబోతున్నాడు.
ఇవాళ, అంటే ఆగస్టు 30 బుధవారం ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. చాలా అరుదుగా వచ్చే సూపర్ బ్లూ మూన్(Super Blue Moon) కనువిందు చేయబోతున్నది. ఇది ప్రత్యేకమైన పున్నమి. అన్ని పున్నమి రోజుల్లో కాకుండా ఇవాళ చంద్రుడు చాలా పెద్దగా, కాంతివంతంగా కనిపిస్తాడు. చంద్రుడు భూమికి(Earth) అత్యంత సమీపంలోకి రాబోతున్నాడు. అంటే భూమికి 3.57,244 కిలోమీటర్ల దూరంలో చంద్రుడు రాబోతున్నాడు. ఇదే రోజు పున్నమి కావడంతో జాబిల్లి పెద్దగా కనిపిస్తాడు. ఇది ఈ నెలలో కనిపించే రెండో ఫుల్ మూన్(FullMoon). ఆగస్టు 1వ తేదీన తొలి పౌర్ణమి రోజు బ్లూ మూన్ కనిపించింది. అందుకే ఇవాళ కనిపించే చంద్రుడిని సూపర్ బ్లూ మూన్‌గా పిలుస్తున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు సూపర్ బ్లూ మూన్ ఆవిష్కృతం కానుంది. సాధారణంఆ ఏడాదిలో రెండు మూడు సూపర్ మూన్‌లు ఏర్పడుతుంటాయి. ఈ సూపర్‌బ్లూ మూన్ బుధవారం రాత్రి 7.10 గంటలకు కనిపిస్తుంది. రెండు గంటల తర్వాత అత్యంత ప్రకాశవంతంగా మారుతుంది. పెద్దదిగా కనిపిస్తుంది. గురువారం ఉదయం 6.46 గంటలకు చంద్రుడు అస్తమిస్తాడు. బయట వెలుతురు తక్కువగా ఉన్న సమయంలో చంద్రుడు మరింత అందంగా కనిపిస్తాడని సైంటిస్టులు అంటున్నారు.
అందుకే భారత ప్రజలు తెల్లవారుజామున చంద్రుడిని చూడటం మంచిదని అంటున్నారు. బ్లూ మూన్ అంటే చంద్రుడు నీలి రంగులో కనిపిస్తాడని కాదు. ఓ నెలలో రెండుసార్లు పౌర్ణమి వస్తే, రెండోసారి ఏర్పడే పున్నమి చంద్రుడిని బ్లూ మూన్‌గా పిలుస్తారు. అందుకే ఇంగ్లీషులో వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్(Once In A Blue Moon) అనే నానుడి వచ్చింది. ఖగోళ పరిస్థితుల కారణంగా పదేళ్లకోసారి మాత్రమే బ్లూ సూపర్ మూన్ వస్తుంది. ఒక్కోసారి ఇరవై సంవత్సరాలు కూడా పట్టవచ్చని నాసా(NASA) అంటోంది. 2009 డిసెంబర్‌లో చివరిసారిగా బ్లూ మూన్ ఏర్పడింది. మళ్లీ 2037 జనవరిలో బ్లూ మూన్ దర్శనమిస్తుంది. మరోటి మార్చిలో కనిపించనుంది. ఇవాళ కనుక మనం బ్లూ మూన్‌ను చూడటం మిస్సయితే మాత్రం 14 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒకే నెలలో బ్లూ మూన్, సూపర్ మూన్‌లు దర్శనమివ్వడం అన్నది ఎప్పుడో కాని జరగదు. ఇప్పుడు కనిపించే సూపర్ బ్లూ మూన్ నాలుగు పున్నమిలతో కూడిన సీజన్‌లో అదనపు చంద్రుడు. ఇవాళ ఏర్పడబోయే బ్లూ మూన్ చాలా ప్రత్యేకమైంది. సాధారణంగా పున్నమి రోజుల కంటే సూపర్‌మూన్ సమయంలోనే చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. దాంతో పాటు పెద్దగా కనిపిస్తాడు. 16 శాతం ఎక్కువ వెన్నెలను కురిపించబోతున్నాడు.