Sunitha Reddy : వైసీపీకి ఓటు వేయకండి... సునీతారెడ్డి రిక్వెస్ట్!
దివంగత మాజీ మంత్రి వై.ఎస్.వివేకానంద రెడ్డి(YS Vivekanada) కూతురు సునీతారెడ్డి(Sunitha reddy) మరోసారి మీడియా ముందుకొచ్చారు. తన తండ్రిని హత్య చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని గట్టిగా అన్నారు. ఈ విషయంలో తనకు ప్రజాకోర్టులో(praja court) తీర్పు కావాలన్నారు. జరిగిన ఘటనలు ప్రజల ముందు ఉంచితేనే తనకు న్యాయం జరుగుతుందని ఆమె చెప్పారు. ఢిల్లీలో(Delhi) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పరోక్షంగా వైఎస్ జగన్‌ను(YS Jagan) నిందితుడిగా పేర్కొన్నారు.
దివంగత మాజీ మంత్రి వై.ఎస్.వివేకానంద రెడ్డి(YS Vivekanada) కూతురు సునీతారెడ్డి(Sunitha reddy) మరోసారి మీడియా ముందుకొచ్చారు. తన తండ్రిని హత్య చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని గట్టిగా అన్నారు. ఈ విషయంలో తనకు ప్రజాకోర్టులో(praja court) తీర్పు కావాలన్నారు. జరిగిన ఘటనలు ప్రజల ముందు ఉంచితేనే తనకు న్యాయం జరుగుతుందని ఆమె చెప్పారు. ఢిల్లీలో(Delhi) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పరోక్షంగా వైఎస్ జగన్‌ను(YS Jagan) నిందితుడిగా పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన నాన్న ఓటమి పాలయ్యారని, సొంత వాళ్లే మోసం చేసి ఓడించారని చెప్పారు. పరాజితుడైన తన తండ్రిని మరింత అణచివేయాలని కొందరు చూశారని సునీతారెడ్డి చెప్పుకొచ్చారు. 'హత్య తర్వాత మార్చురీ దగ్గర అవినాష్ నాతో మాట్లాడాడు. పెదనాన్న రాత్రి 11.30 గంటల వరకు నా కోసం ప్రచారం చేశారని చెప్పాడు. అలా ఎందుకు చెప్పాడో అర్థం కాలేదు' అని సునీత అన్నారు. ఒక్కో సారి హంతకులు మన మధ్యే ఉంటున్నా తెలియనట్లే ఉంటుందని చెబుతూ, సీబీఐ ఎంక్వైరీకి వెళదామని జగన్ ను అడిగానని, సీబీఐకి వెళ్తే అవినాష్ బీజేపీలోకి వెళతారని జగన్ సమాధానం ఇచ్చాడని తెలిపారు. ఈ కేసులో అరెస్ట్, ఛార్జిషీటుకు ఏడాది సమయం పట్టిందని, కేసు దర్యాప్తు ఎందుకంత ఆలస్యం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ముందు సీబీఐ విచారణకు ఆదేశించిన జగన్ తర్వాత పిటిషన్‌ను ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని ప్రశ్నించారు. విలువలు, విశ్వసనీయత, మాట తప్పను మడమ తిప్పను అని ముఖ్యమంత్రి జగన్ పదేపదే అంటుంటారని, నాన్న వివేకా హత్య కేసులో ఇలాంటివి ఏమయ్యాయి? అని సునీత ప్రశ్నించారు.సీబీఐ విచారణలో నిందితులుగా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారని కచ్చితంగా వారిని జగన్ రక్షిస్తున్నారన్నారు. హత్యలో జగన్ పాత్ర ఉందా లేదా అనేది తాను చెప్పకూడదని సునీత పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు ఓటు వేయకూడదని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.