Weather Report : దేశంలో మండిపోతున్న ఎండలు, అల్లాడిపోతున్న జనాలు
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. అనేక రాష్ట్రాలు అధిక ఉష్ణోగ్రతలతో మాడిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలలోనూ ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 నంచి 43 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. రాత్రిపూట కూడా వేడిగాలులు వీస్తున్నాయి. ఉదయం పది దాటిందంటే గడపదాటి బయటకు రావడానికి జనం జంకుతున్నారు. మిట్టమధ్యాహ్నం రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. కర్నూలు జిల్లాలో 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతనమోదయ్యింది. ఈ వేసవి సీజన్‌లో ఇదే అత్యధికం.
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. అనేక రాష్ట్రాలు అధిక ఉష్ణోగ్రతలతో మాడిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలలోనూ ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 నంచి 43 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. రాత్రిపూట కూడా వేడిగాలులు వీస్తున్నాయి. ఉదయం పది దాటిందంటే గడపదాటి బయటకు రావడానికి జనం జంకుతున్నారు. మిట్టమధ్యాహ్నం రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. కర్నూలు జిల్లాలో 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతనమోదయ్యింది. ఈ వేసవి సీజన్‌లో ఇదే అత్యధికం. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 45.35 డిగ్రీల ఉష్ణోగ్రత, ఉదయగిరిలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని భారత వాతావరణశాఖ చేసిన హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.