సుదర్శన్ పట్నాయక్‌కు(Sudarshan Patnayak) ఇంట్రో అవసరం లేదు. ఆయన ఇసుకతో చేసే సైకత శిల్పాలతో ఆయనకు ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ వచ్చింది. ఆయన పాపులారిటీ సముద్రాలు దాటింది. ఇప్పుడు క్రిస్మస్(Christmas) పండుగ సందర్శంగా ఓ ఆకర్షణీయమైన సైకత శిల్పాన్ని తయారు చేశారాయన! వంద అడుగుల పొడవున్న సైకత శాంటాక్లాజ్(Santa Claus) శిల్పాన్ని తీర్చిదిద్దరు నవీన్ పట్నాయక్.
సుదర్శన్ పట్నాయక్‌కు(Sudarshan Patnaik) ఇంట్రో అవసరం లేదు. ఆయన ఇసుకతో చేసే సైకత శిల్పాలతో ఆయనకు ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ వచ్చింది. ఆయన పాపులారిటీ సముద్రాలు దాటింది. ఇప్పుడు క్రిస్మస్(Christmas) పండుగ సందర్శంగా ఓ ఆకర్షణీయమైన సైకత శిల్పాన్ని తయారు చేశారాయన! వంద అడుగుల పొడవున్న సైకత శాంటాక్లాజ్(Santa Claus) శిల్పాన్ని తీర్చిదిద్దరు నవీన్ పట్నాయక్. దీనిని రెండు వేల కిలోల ఉల్లిగడ్డలతో(Onions) అలంకరించారు. ఈ శిల్పం ప్రపంచంలోనే అతి పెద్ద శాంటాక్లాజ్‌గా గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగకు ఏదో ఒకటి కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తానని, లాస్టియర్ టమాటాలతో శాంటాక్లాజ్‌ను తయారు చేశానని, ఈసారి ఉల్లిపాయలతో శాంటాను అలంకరించానని సుదర్శన్ పట్నాయక్ తెలిపారు. భూమిని కాపాడుకోవాలనే సందేశం ఇవ్వడమే తన ఉద్దేశమన్నారు. అందుకే మొక్కను కానుకగా ఇవ్వండి, పుడమని పచ్చగా మార్చండి అనే స్లోగన్(Slogan) కూడా రాశానని వివరించారు. వంద అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పు ఉన్న ఈ సైకత ఉల్లిగడ్డల శాంటాక్లాజ్‌ను తయారుచేయడానికి సుదర్శన్ పట్నాయక్‌కు ఎనిమిది గంటల సమయం పట్టింది.