సహారా గ్రూప్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త సుబ్రతా రాయ్ సహారా మంగళవారం అర్థరాత్రి కన్నుమూశారు. 75 ఏళ్ల వయసులో ఆయ‌న‌ ముంబైలో తుది శ్వాస విడిచారు. సుబ్రతా రాయ్ చాలా కాలంగా తీవ్ర అనారోగ్యంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సహారా గ్రూప్(Sahara Group) అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త సుబ్రతా రాయ్((Subrata Roy Sahara)) సహారా మంగళవారం అర్థరాత్రి కన్నుమూశారు. 75 ఏళ్ల వయసులో ఆయ‌న‌ ముంబై(Mumbai)లో తుది శ్వాస విడిచారు. సుబ్రతా రాయ్ చాలా కాలంగా తీవ్ర అనారోగ్యంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సుబ్రతా రాయ్ భౌతికకాయాన్ని బుధవారం లక్నో(Lucknow)లోని సహారా నగరానికి తీసుకురానున్నారు. ఇక్కడ ఆయ‌న భౌతిక‌కాయానికి అంతిమ‌ వీడ్కోలు ప‌లుక‌నున్నారు. ఆయ‌న‌కు భార్య స్వప్నా రాయ్(Swapna Roy), ఇద్దరు కుమారులు సుశాంతో రాయ్, సీమాంటో రాయ్ ఉన్నారు.

సహారా ఇండియా పరివార్(Sahara India Pariwar) ప్ర‌క‌ట‌న‌లో- "మా మేనేజింగ్ వర్కర్ మరియు ఛైర్మన్ 'సహారశ్రీ' సుబ్రతా రాయ్ సహారా మరణించారని సహారా ఇండియా పరివార్ చాలా బాధతో తెలియజేస్తుంది. సహారాశ్రీ జి ఒక స్ఫూర్తిదాయకమైన, దూరదృష్టి గల వ్యక్తి. ఆయ‌న అధిక రక్తపోటు, మధుమేహంతో సుదీర్ఘ పోరాటం తర్వాత కార్డియోస్పిరేటరీ అరెస్ట్ కారణంగా 14 నవంబర్ 2023న రాత్రి 10.30 గంటలకు మరణించారు. ఆరోగ్యం క్షీణించడంతో నవంబర్ 12న కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (KDAH)లో చేరార‌ని.. ఆయ‌న మ‌ర‌ణం సహారా ఇండియా కుటుంబానికి తీర‌ని లోటుగా పేర్కొంది.

సుబ్రతా రాయ్ జూన్ 10, 1948న బీహార్‌(Bihar)లోని అరారియా జిల్లాలో జన్మించారు. కోల్‌కతా(Kolkata)లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తర్వాత.. ఆయ‌న‌ గోరఖ్‌పూర్‌(Gorakpur)లోని ప్రభుత్వ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. సుబ్రతా రాయ్ తన మొదటి వ్యాపారాన్ని గోరఖ్‌పూర్‌లోనే ప్రారంభించాడు. ఆ త‌ర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ స‌హారా సామ్రా.్యాన్ని విస్త‌రించారు.

Updated On 14 Nov 2023 10:04 PM GMT
Yagnik

Yagnik

Next Story