తిరుమల లడ్డూ(Tirumala laddu) వివాదంపై సుప్రీంకోర్టులో((supreme court)) విచారణ జరిగింది
తిరుమల లడ్డూ(Tirumala laddu) వివాదంపై సుప్రీంకోర్టులో((supreme court)) విచారణ జరిగింది. లడ్డూ విచారణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
లడ్డూ వివాదంపై స్వతంత్ర దర్యాప్తునకు((independent investigation)) ఆదేశించింది. స్వతంత్ర దర్యాపు కోసం సిట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఐదుగురు సభ్యులతో కొత్త సిట్ ఏర్పాటు చేసింది. సీబీఐ(CBI) నుంచి ఇద్దరు, సిట్(SIT) నుంచి ఇద్దరు, FSSAI నుంచి ఒకరు ఉండాలని ఆదేశించింది.
సీబీఐ డైరెక్టర్ విచారణను పర్యవేక్షిస్తారని సూచించింది. పొలిటికల్ డ్రామాను అంగీకరించబోమని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సుబ్రమణ్యస్వామి కూడా స్పందించారు. లడ్డూ ప్రసాదం పంపిణీపై విచారణ, కల్తీ నెయ్యిపై క్షుణ్ణంగా విచారించి స్పష్టమైన తీర్పు వచ్చే వరకు మనం వేచి ఉండాలని సుబ్రమణ్యస్వామి అన్నారు.