తిరుమల లడ్డూ(Tirumla laddu) వివాదానికి సంబంధించి ఏ విచారణ జరగాల్సిన అవసరం ఉంది?

తిరుమల లడ్డూ(Tirumla laddu) వివాదానికి సంబంధించి ఏ విచారణ జరగాల్సిన అవసరం ఉంది? ఎందుకు విచారణ జరగాలి? ఏం తేల్చాల్సిన అవసరం ఉంది? సీబీఐ విచారణ(CBI Investigation) జరిపించాలంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత(YCP), మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) డిమాండ్‌ చేస్తూ ఉన్నారు. సీబీఐ విచారణ జరిపి దోషులెవరో తేల్చాలని జగన్‌ అంటున్నారు. ఈ మేరకు ఆయన సుప్రీంకోర్టు(Supreme court) ప్రధాన న్యాయమూర్తికి, ప్రధానమంత్రి మోదీకి లేఖ రాస్తానంటున్నారు. ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఇది ఇలా ఉండగా బీజేపీ(BJP) నేత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. లడ్డూ కోసం వాడిన నెయ్యిలో(Ghee) జంతు మాంసం వాడారన్న చంద్రబాబు(Chandrababu) ఆరోపణలపై ఏదైనా ఏజెన్సీతో విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును సుబ్రమణ్యస్వామి కోరారు. కోట్లాది భక్తులకు సంబంధించిన అంశం కాబట్టి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు.

Eha Tv

Eha Tv

Next Story