హిమాచల్ ప్రదేశ్‌లోని(Himachal Pradesh) మండీ జిల్లాకు చెందిన సుమన్ కుమారి(Suman Kumari) స్నైపర్ శిక్షణను పూర్తి చేసుకున్నారు. తల్లి గృహణి కాగా, తండ్రి ఎలక్ట్రీషియన్‌గా ఉన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిత్యం గస్తీ కాస్తూ శత్రుమూకల నుంచి దేశాన్ని రక్షించడంలో బీఎస్‌ఎఫ్ (బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్) ప్రధాన పాత్ర పోషిస్తోంది.
హిమాచల్ ప్రదేశ్‌లోని(Himachal Pradesh) మండీ జిల్లాకు చెందిన సుమన్ కుమారి(Suman Kumari) స్నైపర్ శిక్షణను పూర్తి చేసుకున్నారు. తల్లి గృహణి కాగా, తండ్రి ఎలక్ట్రీషియన్‌గా ఉన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిత్యం గస్తీ కాస్తూ శత్రుమూకల నుంచి దేశాన్ని రక్షించడంలో బీఎస్‌ఎఫ్ (బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్) ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇంతటి కీలక దళంలో చేరిన మొట్టమొదటి మహిళా స్నైపర్‌గా హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సుమన్ కుమారి చరిత్ర సృష్టించారు. ఇండోర్‌లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ ట్యాక్టిక్స్ (సీఎస్‌డబ్ల్యూటీ)లో కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన ఆమె.. ఇటీవలే ‘ఇన్‌స్ట్రక్టర్ గ్రేడ్’ పొందారు. మాటువేసి, దూరం నుంచే శత్రువుపైకి గురితప్పకుండా కాల్పులు జరిపేవారిని ‘స్నైపర్’లుగా పేర్కొంటారు. 8 నిమిది వారాల కఠోర శిక్షణను కుమారి విజయవంతంగా పూర్తి చేశారు. 2021లో బీఎస్‌ఎఫ్‌లో కుమారి చేరారు. నిరాయుధంగా శత్రువుతో పోరాడే ‘నిరాయుధ దళం’కు గతంలోనే ఆమె ఎంపికయ్యారు. పాకిస్తాన్ సరిహద్దుల వెంట మాటువేసి అదనుచూసి చొరబాట్లకు తెగబడే ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో స్నైపర్‌లది కీలక పాత్ర ఉంటోంది.