పాపం ఆ ఎస్‌ఐకి కోటిన్నర రూపాయలు గెల్చుకున్న ఆనందం ఎంతో కాలం నిలవలేదు. విధుల నుంచి సస్పెండ్ అయ్యారు. అసలేం జరిగిందంటే మహారాష్ట్రలోని(Maharastra) పింప్రీ-ఛించ్వాడ్ పోలీస్ కమిషనరేటులో పని చేసే ఎస్‌ఐ సోమనాథ్(Somnath) అన్‌లైన్ బెట్టింగ్ యాప్(Online Betting App) డ్రీమ్ 11(Dream 11) లో కోటిన్నర రూపాయలు గెల్చుకున్నారు.
పాపం ఆ ఎస్‌ఐకి కోటిన్నర రూపాయలు గెల్చుకున్న ఆనందం ఎంతో కాలం నిలవలేదు. విధుల నుంచి సస్పెండ్ అయ్యారు. అసలేం జరిగిందంటే మహారాష్ట్రలోని(Maharastra) పింప్రీ-ఛించ్వాడ్ పోలీస్ కమిషనరేటులో పని చేసే ఎస్‌ఐ సోమనాథ్(Somnath) అన్‌లైన్ బెట్టింగ్ యాప్(Online Betting App) డ్రీమ్ 11(Dream 11) లో కోటిన్నర రూపాయలు గెల్చుకున్నారు. ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్‌లో తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి జట్టును ఎంచుకుని డ్రీమ్ 11లో పాల్గొన్నారు. అందులో ఆయన కోటిన్నర రూపాయలు గెల్చుకున్నాడు. దీంతో ఆయన ఫ్యామిలీతో కలిసి సంబరాలు చేసుకున్నారు. అప్పుడే వార్తల్లోకి ఎక్కారు. అయతే విషయం ఉన్నతాధికారులకు తెలిసింది. నిబంధనలకు అతిక్రమించి పోలీస్‌శాఖ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ సోమనాథ్‌ను విధుల నుంచి సస్పెండ్(Suspend) చేశారు. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన అధికారి ఆన్‌లైన్ గేమింగ్‌లో పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు శాఖ పరువు తీస్తున్నారనే కారణంగా ఆయనను సస్పెండ్ చేసినట్టు ఏసీపీ సతీశ్ మానే చెప్పారు. ఈ వ్యవహారాన్ని స్థానిక డీసీపీకి అప్పగించారు. గత మూడు నెలలుగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లో ఎస్‌ఐ సోమనాథ్ పాల్గొంటున్నారని నిర్దారించారు. దీంతో కోటిన్నర గెలుచుకున్న ఆనందం గంటల్లో ఆవిరైపోయింది.