మీరు ఎర్ర చీమలను(Red ants) చూసుంటారు. నల్ల చీమలను(Black ants) కూడా చూసుంటారు. ఎప్పుడైనా బ్లూ కలర్ చీమలను(Blue Ants) చూశారా? నీలం రంగు చీమలు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోకండి.. అరుణాచల్‌ప్రదేశ్‌కు(arunachal pradesh) వెళితే ఆ కలర్ చీమలను చూడొచ్చు. సియాగ్ లోయలో ఈ అరుదైన నీలి చీమలను పరిశోధకులు కనుగొన్నారు.

Blue Ants
మీరు ఎర్ర చీమలను(Red ants) చూసుంటారు. నల్ల చీమలను(Black ants) కూడా చూసుంటారు. ఎప్పుడైనా బ్లూ కలర్ చీమలను(Blue Ants) చూశారా? నీలం రంగు చీమలు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోకండి.. అరుణాచల్‌ప్రదేశ్‌కు(arunachal pradesh) వెళితే ఆ కలర్ చీమలను చూడొచ్చు. సియాగ్ లోయలో ఈ అరుదైన నీలి చీమలను పరిశోధకులు కనుగొన్నారు. బెంగుళూరుకు చెందిన అశోకా జీవావరణ, పర్యావరణ పరిశోధనా సంస్థ (అట్రీ), ఫెరిస్ క్రియేషన్స్‌లకు చెందిన సంయుక్త పరిశోధనా బృందం ఈ అరుదైన చీమల జాతిని కనిపెట్టేంత వరకు నీలిరంగు చీమలు ఉంటాయన్న సంగతి తెలియదు. సియాంగ్ లోయ అరుదైన, అపూర్వమైన జీవవైవిధ్యానికి నెలవు. అక్కడ ఉన్న స్థానిక తెగలను అణచివేసేందుకు 1912-1922 సంవత్సరాలలో బ్రిటిష్ ప్రభుత్వం దండయాత్ర చేసింది. బ్రిటిష్ సైన్యం వెంట వెళ్లిన పరిశోధకులు సియాంగ్ లోయలోని ప్రతి మొక్క, బల్లి, కప్ప, చేప, పక్షి, పురుగు పుట్రల వివరాలను సేరించారు. వాటిని భారతీయ మ్యూజియంలో రికార్డుల కోసం భద్రంగా ఉంచారు. సుమారు వందేళ్ల తర్వాత ఇప్పుడు బెంగళూరు పరిశోధకుల బృందం సియాంగ్ లోయకు వెళ్లింది. అక్కడి మారుమూల యింకు గ్రామంలో ఒక చెట్టు తొర్రలో రెండు నీలి చీమలను గుర్తించారు పరిశోధకులు. వాటికి పారాపారాట్రెకినా నీల అని పేరు పెట్టారు. అన్నట్టు ఈ భూమ్మీద 16,724 జాతుల చీమలు ఉన్నాయట! అన్నింటిలోనూ నీలి రంగు చీమలే అత్యంత అరుదైనవట!
