ఢిల్లీలోని(Delhi) ముఖర్జీ నగర్‌లోని(Mukherjee Nagar) ఓ కోచింగ్ సెంటర్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలను ఆర్పేందుకు 11 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. అగ్నిప్రమాదంతో భయబ్రాంతులకు గురైన విద్యార్ధులు(students) కోచింగ్ సెంటర్ భవనంపై నుంచి తాళ్ల(Ropes) సాయంతో కిందకు దిగుతున్నారు.
ఢిల్లీలోని(Delhi) ముఖర్జీ నగర్‌లోని(Mukherjee Nagar) ఓ కోచింగ్ సెంటర్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలను ఆర్పేందుకు 11 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. అగ్నిప్రమాదంతో భయబ్రాంతులకు గురైన విద్యార్ధులు(students) కోచింగ్ సెంటర్ భవనంపై నుంచి తాళ్ల(Ropes) సాయంతో కిందకు దిగుతున్నారు. స్పాట్ లో ఉన్నవారు షేర్ చేసిన చిత్రాలు కలవరపెడుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పివేశాము. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని అగ్నిమాపక డైరెక్టర్ అతుల్ గార్గ్ చెప్పారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.