కోల్‌కతా(Kolkata)లో ట్రైనీ డాక్టర్‌(Trainee Doctor)పై అత్యాచారం చేసి, ఆపై ఘోరంగా హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది.

కోల్‌కతా(Kolkata)లో ట్రైనీ డాక్టర్‌(Trainee Doctor)పై అత్యాచారం చేసి, ఆపై ఘోరంగా హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. మమతా బెనర్జీ (Mamata benarjee) ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. దీదీ పాలనలో మహిళలకు భద్రత కరువయ్యిందంటూ ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఓ విద్యార్థి సోషల్‌ మీడియాలో చేసిన పోస్టు వివాదాస్పదంగా మారింది. కీర్తి శర్మ(Keerthi Sharma) అనే డిగ్రీ స్టూడెంట్‌(Degree Student) మమత బెనర్జీకి హత్య బెదిరింపులు చేశాడు. నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ(Indira Gandhi)ని కాల్చి చంపినట్టుగానే మమతా బెనర్జీని కూడా కాల్చి చంపాలి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు కీర్తి శర్మ. దీంతో పాటు బాధితురాలి ఫోటో కూడా పెట్టారు. దీనిపై తృణమూల్‌ కాంగ్రెస్‌(Trinamool Congress) నేతలు పోలీసులకు కంప్లయింట్‌ చేశారు. పోలీసులు ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. హత్యను, అల్లర్లను ప్రేరేపించడంతో పాటు అత్యాచార బాధితురాలి వివరాలను బయటపెట్టడం చేసినందుకు అతడిపై కేసులు పెడుతున్నామని కోల్‌కతా పోలీసులు చెప్పారు.

ehatv

ehatv

Next Story