కొల్లాం(Kollam)లో ఎలాంటి సంఘటనలు జరిగాయో అలాంటివే ఈసారి మహారాష్ట్ర(Maharastra), బెంగాల్‌(Bengal) రాష్ట్రాలలో చోటు చేసుకున్నాయి. పరీక్షా కేంద్రాలలో తనిఖీల పేరుతో సిబ్బంది వికృత చేష్టలకు పాల్పడ్డారు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. వారిని అవమానించి వెకిలి నవ్వులు నవ్వుకున్నారు. కొన్ని ప్రాంతాలలో లో దుస్తులను కూడా తనిఖీ చేశారు. మరికొన్ని చోట్ల డ్రెస్సులు మార్చుకుని రమ్మన్నారు.

కొల్లాం(Kollam)లో ఎలాంటి సంఘటనలు జరిగాయో అలాంటివే ఈసారి మహారాష్ట్ర(Maharastra), బెంగాల్‌(Bengal) రాష్ట్రాలలో చోటు చేసుకున్నాయి. పరీక్షా కేంద్రాలలో తనిఖీల పేరుతో సిబ్బంది వికృత చేష్టలకు పాల్పడ్డారు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. వారిని అవమానించి వెకిలి నవ్వులు నవ్వుకున్నారు. కొన్ని ప్రాంతాలలో లో దుస్తులను కూడా తనిఖీ చేశారు. మరికొన్ని చోట్ల డ్రెస్సులు మార్చుకుని రమ్మన్నారు. ఆదివారం రోజు దేశవ్యాప్తంగా నీట్‌ యూజీ ప్రవేశ పరీక్ష(NEET UG 2023) జరిగింది. నాలుగు వేల కేంద్రాలలో జరిగిన ఈ పరీక్షకు సుమారు 20 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారు.

పరీక్ష రాయడానికి వెళ్లిన తమతో తనిఖీల పేరుతో సిబ్బంది దారుణంగా ప్రవర్తించారని విద్యార్ధినులు గోడు వెలిబుచ్చుకున్నారు. మహారాష్ట్రలోని సంగ్లీ ప్రాంతంలో ఓ పరీక్షా కేంద్రం దగ్గర అమ్మాయిల లోదుస్తుల హుక్స్‌ను కూడా తనిఖీ చేశారట! కొంతమంది కుర్తాలను విప్పించి వాటిని తిరగేసుకోమని చెప్పారట! ఈ విషయాన్ని చాలా ఆవేదనతో చెప్పారు ఓ వైద్య దంపతులు. వారికెలా తెలిసిందంటే వారి కూతురు ఆ పరీక్షా కేంద్రంలోనే ఎగ్జామ్‌ రాసిందట! పశ్చిమ బెంగాల్‌లోని హిండ్‌మోటార్‌ ప్రాంతంలో ఉన్న హెచ్‌ఎంసీ టెస్ట్‌ సెంటర్‌లో కూడా ఇంచుమించు ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొన్నారు విద్యార్థులు. చాలా మంది అభ్యర్థుల లో దుస్తులను తనిఖీ చేశారు. జీన్స్‌ ధరించిన అమ్మాయిలను ఎగ్జామ్‌ హాల్లోకి అనుమతించలేదు. దాంతో తమతో పాటు వచ్చిన తల్లి లేదా ఇతర బంధువుల డ్రెస్‌లను మార్చుకుని వేసుకున్నారు. కొందరైతే దగ్గరలో ఉన్న దుకాణాలకు పరుగెత్తుకుంటూ వెళ్లి అప్పటికప్పుడు బట్టలు కొనుక్కున్నారు. ఫుల్‌హ్యాండ్స్‌ షర్ట్‌లు వేసుకుని వచ్చిన కొందరు తమ తండ్రుల చొక్కాలను మార్చుకున్నారు. జీన్స్‌ పాంట్‌లను అనుమతించకపోవడంతో కొందరు అబ్బాయిలు చివరి నిమిషంలో ఇన్నర్‌వేర్‌తోనే పరీక్షా కేంద్రంలోనికి వెళ్లారు.. ఇవన్నీ సోషల్‌మీడియాలలో చెప్పుకుని బాధపడుతున్నారు విద్యార్థులు. హెచ్‌ఎంసీ పరీక్షా కేంద్రం ప్రిన్సిపాల్‌ మాత్రం ఇవన్నీ సత్యదూరాలంటున్నారు. డ్రెస్‌ కోడ్‌ రూల్స్‌కు విరుద్ధంగా కొందరు ఎక్కువ జేబులు ఉన్న ప్యాంట్లు వేసుకొచ్చారని, వారినే ప్యాంట్లు మార్చుకురావాలని చెప్పామని, అంతకు మించి ఏమీ జరగలేదని అంటున్నారు.

Updated On 9 May 2023 4:52 AM GMT
Ehatv

Ehatv

Next Story