యూపీ(Uttar Pradesh) వారణాసిలోని(Varanasi) పలు ఆలయాల నుంచి సాయిబాబా(Saibaba) విగ్రహాలను తొలగించడం వివాదానికి దారితీసింది

యూపీ వారణాసిలోని పలు ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించడం వివాదానికి దారితీసింది. 'సనాతన్ రక్షక్ దళ్' చేపట్టిన ప్రచారంలో భాగంగా 10 మందిరాల్లో నిన్న బాబా విగ్రహాలను తొలగించి, ఆలయాల బయట పెట్టారు. సరైన పరిజ్ఞానం లేకుండా సాయిబాబాను ఆరాధిస్తున్నామని, శాస్త్రాల్లో ఎక్కడా బాబా ఆరాధన గురించి చెప్పలేదన్నారు. బాబా ధర్మ గురువే కావొచ్చు కానీ దేవుడు కాదని అయోధ్యలోని హనుమాన్ గఢీ ఆలయ మహంతు అభిప్రాయపడ్డారు.

శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం

దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలోని శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక చర్యలు చేపట్టింది. శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యమివ్వనున్నట్లుగా టీటీడీ ఈవో శ్యామల రావు వెల్లడించారు. బ్రహ్మాత్సవాల సమయంలో ఆర్జిత సేవలు, వీఐపీ సిఫార్సులపై బ్రేక్​ దర్శనాలను రద్దు చేస్తున్నట్లుగా తెలిపారు.

కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఒకే రోజు స్వామివారితో పాటు వాహనసేవల దర్శనభాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలతోపాటు వీఐపీ సిఫార్సులపై బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు.

స్వయంగా వచ్చే వీఐపీలకే దర్శన అవకాశం ఉంటుందని టీటీడీ ఈవో వివరించారు. గరుడ సేవ జరిగే 8వ తేదీన దాన్నీ రద్దు చేస్తున్నట్లుగా వెల్లడించారు. శ్రీవారి దర్శనాలలో సామాన్యులకే ప్రాధాన్యమివ్వనున్నట్లు పునరుద్ఘాటించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆయన మాట్లాడారు.

'శ్రీవారి బ్రహ్మోత్సవాల రోజుల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనాల కోసం 1.32 లక్షల టికెట్లను ఆన్‌లైన్​లో జారీ చేశాం. ఈ వ్యవధిలో సర్వదర్శనానికి వచ్చే వారికి తిరుపతిలో రోజుకు 24 వేల టోకెన్లను ఇవ్వనున్నాము. దీని వల్ల రోజుకు సుమారు 80 వేలు, గరుడ సేవనాడు లక్ష మంది దర్శించుకునేందుకు వీలుంటుంది. ఉదయం ఎనిమిదింటి నుంచి పది గంటల వరకు, సాయంత్రం 7గంటల నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు జరిగే వాహన సేవలను తిలకించేందుకు ఏర్పాట్లు చేశాం"- శ్యామల రావు, టీటీడీ ఈవో

3.5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా : 'గరుడ సేవ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 11 గంటల వరకు జరుగుతుంది. ఈ వేడుకను రెండు లక్షల మంది ప్రత్యక్షంగా వీక్షించే విధంగా గ్యాలరీలను, వారికి అన్నప్రసాద వితరణ తదితర ఏర్పాట్లను చేస్తున్నాం. ఆ రోజు తిరుమల కొండపైకి 3.5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశాం. తిరుమలలో మొత్తంగా 6,200 రూంలు అందుబాటులో ఉంటాయి.

ఆన్‌లైన్‌ కోటా తగ్గించి కరెంటు బుకింగ్‌ ద్వారానే గదులు అందిస్తాము. వీఐపీల కోసం 1300 గదులు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా 40 వేల మంది భక్తులకు వసతి కల్పిస్తాం. ఇవే కాకుండా తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, ఇతర వసతి గృహాలూ అందుబాటులో ఉంటాయి' అని శ్యామలరావు తెలిపారు.

తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలోనే కాకుండా కొండపై పలు ప్రాంతాల్లో అన్నప్రసాద కేంద్రాలు అందుబాటులో ఉంచుతామని టీటీడీ ఈవో శ్యామలరావు వివరించారు. గరుడ సేవనాడు ఉదయం ఏడింటినుంచి రాత్రి ఒంటిగంట వరకు వెంగమాంబ అన్నదాన సత్రం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. సాధారణ రోజుల్లో 3.5 లక్షల లడ్డూలను ఇస్తున్నామని తెలిపారు. ఉత్సవాల నేపథ్యంలో మరో ఏడు లక్షల నిల్వలు అందుబాటులో ఉంచుతామని శ్యామల రావు వెల్లడించారు. ప్రసాదాల పంపిణీకి మరో 11 కౌంటర్లు ఏర్పాటుచేస్తున్నామన్నారు. భద్రత దృష్ట్యా 12 ఏళ్లలోపు పిల్లలకు గుర్తించేందుకు వారికి ట్యాగ్‌ వేస్తున్నామని వివరించారు.

తిరుపతిలో ఐదు ప్రాంతాల్లో పార్కింగ్‌ కేంద్రాల వద్ద ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచనున్నామన్నారు. ఆర్టీసీ బస్సులు రోజూ 2వేల ట్రిప్పులు, గరుడసేవ నాడు 3వేల ట్రిప్పులు నడుస్తాయని ఆయన వివరించారు. గరుడ సేవనాడు కనుమ దారుల్లో ద్విచక్రవాహనాల రాకపోకలను నిలిపేస్తామని స్పష్టం చేశారు. గతేడాది 12 రాష్ట్రాలనుంచి సాంస్కృతిక బృందాలు వస్తే ఈసారి 21 రాష్ట్రాలనుంచి 60 బృందాలు రానున్నాయని ఈవో వెల్లడించారు.

Updated On 2 Oct 2024 8:36 AM GMT
Eha Tv

Eha Tv

Next Story