మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ(Medak Ordnance Factory)ని ప్రైవేటుపరం చేయవద్దని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌(Rajnath Singh)కు మంత్రి హరీశ్‌రావు(Harish Rao) ఓ లేఖ రాశారు. దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటుపరం చేయడానికి కేంద్రప్రభుత్వం సంసిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే హరీశ్‌రావు కేంద్రమంత్రికి లేఖ రాశారు. మెదక్‌తో పాటు ఇతర ఆర్టినెన్స్‌ ఫ్యాక్టరీలను ఎట్టి పరిస్థితులలో ప్రైవేటు సంస్థలకు అప్పగించకూడదని డిమాండ్‌ చేశారు.

మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ(Medak Ordnance Factory)ని ప్రైవేటుపరం చేయవద్దని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌(Rajnath Singh)కు మంత్రి హరీశ్‌రావు(Harish Rao) ఓ లేఖ రాశారు. దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటుపరం చేయడానికి కేంద్రప్రభుత్వం సంసిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే హరీశ్‌రావు కేంద్రమంత్రికి లేఖ రాశారు. మెదక్‌తో పాటు ఇతర ఆర్టినెన్స్‌ ఫ్యాక్టరీలను ఎట్టి పరిస్థితులలో ప్రైవేటు సంస్థలకు అప్పగించకూడదని డిమాండ్‌ చేశారు. దేశ భద్రత, 74 వేల మంది ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విన్నవించుకున్నారు. 'డిఫెన్స్ రంగంలో ఉన్న ఏడు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా ఆయా సంస్థల మధ్య పోటీ నెలకొంటుంది. దీంతో నూతన ఆయుధాల అభివృద్ధి నిలిచిపోతుంది. ఇది మేకిన్ ఇండియా స్ఫూర్తిని దెబ్బతీస్తుంది' అని లేఖలో హరీశ్‌ పేర్కొన్నారు.

మెదక్‌లోని ఆర్టినెన్స్‌ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయడానికి కేంద్రం పన్నిన పన్నాగాలెన్నో. నిజానికి ఫ్యాక్టరీకి, సిబ్బందికి క్రితం ఆర్ధిక సంవత్సరం వరకు బోల్డంత పని ఉండేది. సుమారు 930 కోట్ల రూపాయల ఆర్డర్లను సకాలంలో పూర్తి చేశారు. ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించడానికి ఉద్యోగులు సర్వదా సిద్ధంగా ఉన్నారు. కేంద్రం వ్యూహాత్మకంగా మెదక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీకి ఎలాంటి పని అప్పగించలేదు. ఇప్పుడు దీన్ని సాకుగా చూపించి ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీని సిక్‌ ఇండస్ట్రీగా ప్రకటిస్తారేమోనన్న భయం కార్మికులలో ఉంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం ప్రత్యక్షంగా రెండున్నర వేల మంది ఉద్యగులు రోడ్డునపడతారు. పరోక్షంగా అయిదువేల మంది ఉపాధి పోతుంది. మొత్తంగా పాతిక వేల మంది భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోతుంది. ఈ నేపథ్యంలో ఆయుధ కర్మాగార తెలంగాణ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధులు హరీశ్‌రావును కలిశారు. ప్రైవేటీకరణను అడ్డుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు ఆరు డిమాండ్లు చేశారు. మొదటిది మూడు రైతు చట్టాలలాగే డిఫెన్స్‌ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి. రెండోది పరిశోధనల విభాగాన్ని మరింత పటిష్టం చేయాలి. మూడోది మిషనరీని ఆధునీకరించాలి. ఉద్యోగులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో ట్రైనింగ్‌ ఇవ్వాలి. నాలుగోది పరిపాలన, కొనుగోలు విధానాలను సరళీకరించాలి. అయిదోది ఆర్మీ అవసరాలకు అనుగుణంగా ఆర్డినెన్స్‌ ఫ్యాక్టీరిక ఆర్డర్లు ఇవ్వాలి. ఆరోది ప్రసారభారతిలోలాగే ఇక్కడా ఉద్యోగులకు భద్రత కల్పించాలి. వీటిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాజ్‌నాథ్‌సింగ్‌కు రాసిన లేఖలో హరీశ్‌ పేర్కొన్నారు.

Updated On 24 April 2023 12:42 AM GMT
Ehatv

Ehatv

Next Story