కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఒకే రోజు నాలుగు సభల్లో పాల్గొన్న కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల స్టార్ కంపెయినర్ రేవంత్.. తన ప్రసంగాలతో కన్నడిగులను ఆకట్టకున్నారు. రేవంత్ మాట్లాడుతూ.. గుజరాతీ లు నరేంద్ర మోదీ, అమిత్ షాల వెంట ఉన్నారు. మరి మన కర్ణాటక వాళ్లం.. మన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెంట ఉండాలి కదా.. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడిగా మన పూర్వ హైదరాబాద్, కర్ణాటక బిడ్డ మల్లికార్జున్ ఖర్గే కు అవకాశం వచ్చింది. మనమంతా ఆయన వెంట ఉండి కర్ణాటకలో కాంగ్రెస్ కు 150 సీట్లు గెలిపించి ఘన విజయం సాధించి పెట్టాలని పిలుపునిచ్చారు.

Star campaigner Revanth Reddy spoke in four meetings on the same day
కర్ణాటక అసెంబ్లీ(Karnataka Assembly Elections) ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాల్గొన్నారు. ఒకే రోజు నాలుగు సభల్లో పాల్గొన్న కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల స్టార్ కంపెయినర్(Star Campaigner) రేవంత్.. తన ప్రసంగాలతో కన్నడిగులను ఆకట్టకున్నారు. రేవంత్ మాట్లాడుతూ.. గుజరాతీ లు నరేంద్ర మోదీ(Narendra Modi), అమిత్ షా(Amit Shah)ల వెంట ఉన్నారు. మరి మన కర్ణాటక వాళ్లం.. మన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjuna Kharge) వెంట ఉండాలి కదా.. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడిగా మన పూర్వ హైదరాబాద్(Hyderabad), కర్ణాటక(Karnataka) బిడ్డ మల్లికార్జున్ ఖర్గే కు అవకాశం వచ్చింది. మనమంతా ఆయన వెంట ఉండి కర్ణాటకలో కాంగ్రెస్ కు 150 సీట్లు గెలిపించి ఘన విజయం సాధించి పెట్టాలని పిలుపునిచ్చారు. మంగళ వారం ఆయన కర్ణాటక రాష్ట్రంలోని బీదర్(bidar), బాల్కి(Bhalki), బసవ కళ్యాణ్(Basava Kalyan), హుంనాబాద్ నియోజక వర్గాలలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
పలు సభలలో ఏఐసీసీ అధ్యక్షుడు మలికార్జున్ ఖర్గే, ఏఐసీసీ(AICC) కార్యదర్శి శ్రీధర్ బాబులు(Sridhar Babu) కూడా పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆత్మగౌరవంతో బతుకుతామని లేకపోతే.. ఇక్కడ బీజేపీ(BJP) ఇంతకాలం 40 శాతం కమిషన్లు తీస్కొని పనులు చేసిందని ఆరోపించారు. కర్ణాటక వాళ్లు బయటకు వెళ్లి మాది కర్ణాటక అని చెపితే 40 శాతం కమిషన్లు తీసుకునే రాష్ట్రమా అని ఎద్దేవా చేస్తారని అన్నారు. అందుకోసం నిజాయితీ గా పనిచేసే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. మల్లికార్జున్ ఖర్గే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకులని.. ఆయన 9 సార్లు అసెంబ్లీకి, 2 సార్లు పార్లమెంట్ కు ఎన్నికయ్యారని ఆయన రాజకీయానుభవం అపారమైందని అన్నారు. అలాంటి నాయకులు.. మన కర్ణాటక బిడ్డను గెలిపించి మన ఆత్మగౌరవాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు.
