కరోనా వైరస్(Corona Virus) వ్యాప్తి తీవ్రాతితీవ్రంగా ఉన్న కాలంలో ఐటీ ఇండిస్ట్రీ ఉద్యోగులకు(IT employees) ఓ వెసులుబాటు కల్పించింది. ఆఫీసుకు వచ్చి పని చేసే బదులు ఇంటి నుంచే పని(Work From Home) చేయండంటూ చెప్పింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది జనబాహుళ్యంలోకి వెళ్లింది కూడా అప్పట్నుంచే! అంతకు ముందు కూడా ఇది ఉండింది. వారంలో కొన్ని రోజుల పాటు ఇంటి నుంచి పనిచేయడమన్నది కోవిడ్ కాలం కంటే ముందు నుంచే ఉంది. సరే, కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత పలు సంస్థలు కార్యలయాలను తెలిచాయి.
కరోనా వైరస్(Corona Virus) వ్యాప్తి తీవ్రాతితీవ్రంగా ఉన్న కాలంలో ఐటీ ఇండిస్ట్రీ ఉద్యోగులకు(IT employees) ఓ వెసులుబాటు కల్పించింది. ఆఫీసుకు వచ్చి పని చేసే బదులు ఇంటి నుంచే పని(Work From Home) చేయండంటూ చెప్పింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది జనబాహుళ్యంలోకి వెళ్లింది కూడా అప్పట్నుంచే! అంతకు ముందు కూడా ఇది ఉండింది. వారంలో కొన్ని రోజుల పాటు ఇంటి నుంచి పనిచేయడమన్నది కోవిడ్ కాలం కంటే ముందు నుంచే ఉంది. సరే, కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత పలు సంస్థలు కార్యలయాలను తెలిచాయి. ఉద్యోగులు కూడా క్రమక్రమంగా ఆఫీసులకు రావడం మొదలుపెట్టారు. కొన్ని కంపెనీలలో ఉద్యోగులు మాత్రం తాము ఇంటి నుంచే పని చేస్తామని, ఆఫీసుకు రాలేమని చెబుతున్నారు. ఆఫీసుకు రావాల్సిందిగా మెయిల్స్ పంపించినా రిప్లై ఇవ్వడం లేదు. రోజైఊ ఆఫీసుకు వచ్చి పనిచేయడం మా వల్ల కాదంటూ నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. మీరు కాదుకూడదంటే మాత్రం ఉద్యోగం మానేస్తామని హెచ్చరిస్తున్నారు. వర్క్ ఫ్రం హోమ్ నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీసు మాడ్యుల్‌కు మారాలంటే చాలా మంది ఉద్యోగులు భయపడుతున్నారు. ఒక్కసారిగా ఈ విధానానికి మరాడం తమ వల్ల కాదని అంటున్నారు. దాదాపు 69 శాతం మంది ఆఫీసుకెళ్లడానికి విముఖత చూపుతున్నారని స్టాఫింగ్ సొల్యూషన్స్ హెచ్‌ఆర్ సర్వీస్ ప్రొవైడర్ జీనియస్ కన్సల్టెంట్స్ రిపోర్ట్ తెలిపింది. బ్యాంకింగ్ ఫైనాన్స్, ఎడ్యుకేషన్, ఎఫ్ఎంసీజీ, హాస్పిటాలిటీ, హెచ్‌ఆర్ సొల్యూషన్స్, ఐటీ, ఐటీఈఎస్, తయారీ వంటి రంగాల్లో పనిచేసే 1,213 మందితో మాట్లాడి గత ఏడాది అక్టోబర్ 26 నుంచి నవంబర్ 30 వరకు నివేదిక తయారు చేశారు. కార్యాలయలకు(Office) రమ్మని ఆదేశిస్తే రాజీనామాలు పెరిగే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. కంపెనీలు ఫ్లెక్సిబిలిటీకి అవకాశం ఇవ్వాలని చాలా మంది ఉద్యోగులు కోరుతున్నారట! ఇంటితో పాటు ఆఫీసు నుంచి పని చేయడానికి అనుమతించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటికి దూరంగా ఆఫీసు ఉన్న వారికి మినహాయింపులు ఉండాలని 56 శాతం మంది తెలిపారు.