శ్రీనగర్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NCIT)ని అధికారులు మూసేశారు. స్థానికేతర విద్యార్థి సోషల్‌ మీడియాలో(Social Media) దైవదూషణతో కూడిన పోస్ట్‌ పెట్టడంతో వివాదం మొదలయ్యింది. నిరసనగా కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత ఇరువర్గాల విద్యార్థుల మధ్య ఉద్రికత్తలు చోటు చేసుకున్నాయి. ఆ ఉద్రిక్తతలు ఇతర విద్యా సంస్థలకు కూడా వ్యాపించాయి. వందలాది మంది విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి నిందితుడిపై చర్య తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు

శ్రీనగర్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT)ని అధికారులు మూసేశారు. స్థానికేతర విద్యార్థి సోషల్‌ మీడియాలో(Social Media) దైవదూషణతో కూడిన పోస్ట్‌ పెట్టడంతో వివాదం మొదలయ్యింది. నిరసనగా కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత ఇరువర్గాల విద్యార్థుల మధ్య ఉద్రికత్తలు చోటు చేసుకున్నాయి. ఆ ఉద్రిక్తతలు ఇతర విద్యా సంస్థలకు కూడా వ్యాపించాయి. వందలాది మంది విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి నిందితుడిపై చర్య తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు. ఆందోళనలు(Concerns) మరింత ముదరకుండా ఉండేందుకు ఎన్‌ఐటీ అధికారులు విద్యార్థులకు శీతాకాల సెలవులను(winter holidays) ముందుగానే ప్రకటించారు. విద్యార్థులను(Students) క్యాంపస్‌(Campus), హాస్టళ్ల(Hostels) నుంచి ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. నిట్‌ వెబ్‌సైట్‌ను(NIT Website) తాత్కాలికంగా క్లోజ్‌ చేశారు. కశ్మీర్‌లోని ఇతర డిగ్రీ కాలేజీలు కూడా శనివారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించాలని అధికారులు ఆదేశించారు. డిసెంబర్‌ 20లోగా జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. వాయిదా పడిన పరీక్షలను సెలవుల తర్వాత నిర్వహిస్తామని చెప్పారు. అయితే ఉననట్టుండి హాస్టళ్లను ఖాళీ చేయాలని ఆదేశించడంతో అక్కడ చదువుతున్న తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఎన్‌ఐటీలో దాదాపు 300 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. సొంతూళ్లకు వచ్చేందుకు ప్రయాణ సదుపాయాలు లేక అల్లాడిపోతున్నారు. తమను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఇరువర్గాల మధ్య గొడవకు కారణమైన యూట్యూబ్​ వీడియోను పోస్టు చేసిన విద్యార్థిపై కేసు నమోదు చేశారు శ్రీనగర్‌ పోలీసులు.

Updated On 1 Dec 2023 1:55 AM GMT
Ehatv

Ehatv

Next Story