ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్(One day World Cup) టోర్నమెంట్‌లో శ్రీలంక టీమ్(sri Lanka Team) ఘోరంగా విఫలమయ్యింది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. ఏడు మ్యాచ్‌లలో ఓటమి పాలయ్యింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. జట్టు ప్రదర్శించిన పేలవమైన ఆట తీరుకు ఆగ్రహంగా ఉన్న శ్రీలంక క్రీడా శాఖ మంత్రి రోషన్ రణసింఘె(Roshan Ranasinghe) శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యులందరిపైనా వేటు వేశారు.

Arjuna Ranatunga accused Jay Shah
ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్(One day World Cup) టోర్నమెంట్‌లో శ్రీలంక టీమ్(sri Lanka Team) ఘోరంగా విఫలమయ్యింది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. ఏడు మ్యాచ్‌లలో ఓటమి పాలయ్యింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. జట్టు ప్రదర్శించిన పేలవమైన ఆట తీరుకు ఆగ్రహంగా ఉన్న శ్రీలంక క్రీడా శాఖ మంత్రి రోషన్ రణసింఘె(Roshan Ranasinghe) శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యులందరిపైనా వేటు వేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకే అంతర్జాతీయ క్రికెట్ మండలి కూడా లంక క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్(suspension) వేటు వేసింది. లేటెస్ట్‌గా లంక మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గరం అర్జున(arjun) రణతుంగ బీసీసీఐ(BCCI) సెక్రటరీ జై షాపై(Jay shah) ఆసక్తకరమైన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక క్రికెట్ బోర్డును నాశనం చేస్తున్నది జై షా అంటూ ఆరోపించాడు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణతుంగ ఈ మాటన్నారు. 'శ్రీలంక క్రికెట్ ప్రస్తుతం జైషా కనుసన్నలలో నడుస్తున్నదని అతడి ఒత్తిడి వల్లే శ్రీలంక క్రికెట్ నాశనమయ్యిందని అన్నారు. 'శ్రీలంక క్రికెట్‌లోని కొంతమంది వ్యక్తులు జై షా ప్రాపకం కోసం లంక క్రికెట్ బోర్డును నాశనం చేస్తున్నారు. జై షా భారత కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొడుకు కావడంతో అందరినీ తన చెప్పు చేతల్లో పెట్టుకుంటున్నాడు' అని అర్జుణ రణతుంగ అన్నాడు. ఇదిలా ఉంటే ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానంలో ఉండటంతో పాటు ఐసీసీ సస్పెన్షన్ వేటు కూడా వేయడంతో 2025లో పాకిస్తాన్ వేదికగా జరుగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి శ్రీ లంక అర్హత సాధించలేదు.
