ఈసారి శ్రావణ మాసానికి(Sravana Masam) ఓ ప్రత్యేక విశిష్టత ఉంది.

ఈసారి శ్రావణ మాసానికి(Sravana Masam) ఓ ప్రత్యేక విశిష్టత ఉంది. అదేమిటంటే ఈసారి శ్రావణమాసంలో అయిదు సోమవారాలు రానున్నాయి. అంతేకాదు, నాలుగు మంగళవారాలు, నాలుగు శుక్రవారాలు ఉన్నాయి. అంటే శ్రావణం మొత్తం పూజలు(Pooja), వ్రతాలు, నోములేనన్నమాట! తెలుగు పంచాంగం ప్రకారం మనకు ఉన్న 12 నెలలలో అయిదవ మాసం శ్రావణం. మిగిలిన అన్ని నెలలలో పోలిస్తే శ్రావణమాసానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం భగవన్నామ స్మరణతో ఇళ్ళు, ఆలయాలు మారుమోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. వర్ష ఋతువు ఆరంభంలో వచ్చే శ్రావణమాసం లక్ష్మీ నారాయణులకు ప్రీతికరమైన మాసం. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసం ఇది. మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహా విష్ణువు(Maha vishnu) పూజకు ఎంతో విశిష్టమైనది.శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ, మంగళ గౌరీ నోము అని కూడా అంటారు. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే మొదటి శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం మొదలు పెట్టి శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదు సంవత్సరాల పాటు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి.

Eha Tv

Eha Tv

Next Story