Kerala : గూగుల్ చేస్తున్న తప్పులను ఒడిసిపట్టాడు.. కోటి ఎగరేసుకొనిపోయాడు..!
టెక్ దిగ్గజం, సెర్చ్ ఇంజిన్‌లో గూగుల్(Google) పాత్ర గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ విషయాన్నయినా గూగుల్‌లో సెర్చ్ కొడితే క్షణాల్లో లక్షల్లో దానికి సంబంధించిన సమాచారాన్ని మనకు అందిస్తుంది. గూగుల్ వచ్చిన తర్వాత ప్రపంచమే మన ఇంటికి వచ్చినట్లు మారిపోయింది. అయితే దానిలో కూడా సెక్యురిటీ లోపాలున్నాయని(Security Problems) కేరళకు(Kerala) చెందిన ఓ యువకుడు ఆ సంస్థకు చెప్పి భారీ బహుమతి పొందాడు.

కేరళలోని తిరువనంతపురం జిల్లా నెడుమంగడకు చెందిన శ్రీరాం అనే పారిశ్రామికవేత్త గూగుల్ నుంచి రూ. 1.11 కోట్ల భారీ బహుమతిని పొందాడు. గూగుల్ సేవలలలో లోపాలను ప్రచారం చేసే వల్నరబిలిటీ రివార్డ్ ప్రోగ్రామ్- 2022లో కేఎల్ శ్రీరామ్ రెండు, మూడు, నాలుగు స్థానాలను గెలుచుకన్నాడు. గూగుల్‌లో ఉన్న భద్రతా లోపాలను ఇతను కనుగొన్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందుకు అతడికి 1,35,979 డాలర్లు బహుమతి అందుకున్నాడు. స్క్వాడ్రన్ ల్యాబ్స్(Squadron Labs) అనే స్టార్టప్ కంపెనీని శ్రీరామ్(Sri Ram) నడుపుతున్నాడు. కెనడాలో రిజిస్టరైన శ్రీరామ్ కంపెనీ స్క్వాడ్రన్ ల్యాబ్స్ పలు కంపెనీలకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తోంది. ఎన్నో కంపెనీలను సైబర్ దాడులను ఇతని కంపెనీ కాపాడుతుంది. గూగుల్ , ఇతర కంపెనీల సేవలలో భద్రతా లోపాలను గుర్తించి ఇంతకు ముందు కూడా వార్తల్లో నిలిచాడు. తాజాగా గూగుల్‌కు పంపిన సెక్యూరిటీ లోపాలను గుర్తించడంతో అతనికి ఈ భారీ నజరానా దక్కింది