ముంబై విమానాశ్రయం(Mumbai airport) నుంచి ఈనెల 15న రాత్రి 10: 55 వెళ్లాల్సిన విమానం ఆలస్యంగా అర్ధరాత్రి 2 గంటలకు బయల్దేరింది. అయితే ఇందులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది. 14 డీ సీటులో కూర్చున్న వ్యక్తి ఫ్లైట్ టేకాఫయిన కాసేపటికే అందులోని టాయిలెట్‌కు(Toilet) వెళ్లాడు. ఆ తర్వాత టాయిలెట్ డోర్ లాక్(Door Locked) పడింది.

SpiceJet flight
ముంబై విమానాశ్రయం(Mumbai airport) నుంచి ఈనెల 15న రాత్రి 10: 55 వెళ్లాల్సిన విమానం ఆలస్యంగా అర్ధరాత్రి 2 గంటలకు బయల్దేరింది. అయితే ఇందులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది. 14 డీ సీటులో కూర్చున్న వ్యక్తి ఫ్లైట్ టేకాఫయిన కాసేపటికే అందులోని టాయిలెట్‌కు(Toilet) వెళ్లాడు. ఆ తర్వాత టాయిలెట్ డోర్ లాక్(Door Locked) పడింది. బయటకు వచ్చేందుకు ప్రయాణికుడు ప్రయత్నించగా టాయిలెట్ డోర్ ఓపెన్ కాకపోవడంతో అందులోనే ఇరుక్కున్నాడు. అతడిని బయటకు తీసుకొచ్చేందుకు విమానంలోని తోటి ప్రయాణీకులు కూడ ప్రయత్నించారు. టాయిలెట్ డోర్‌ను బయట నుంచి తీసేందుకు ప్రయత్నించినా ఓపెన్ కావడంతో అందులోనే దాదాపు 100 నిమిషాలు ఉండిపోవాల్సి వచ్చింది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని విమాన సిబ్బంది(light Staf) అతనికి చెప్పారు. టాయిలెట్ లో చిక్కుకున్న ప్రయాణీకుడికి ల్యాండింగ్‌లో ఇంజనీర్ సహాయం చేస్తారని తెలిపారు. కమోడ్ మూతను మూసివేసి దానిపై సురక్షితంగా కూర్చోవాలని విమాన సిబ్బంది సూచించారు. మంగళవారం తెల్లవారుజామున బెంగుళూరులోని కెంపేగౌగ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండైంది. ఇంజనీర్లు కష్టపడి టాయిలెట్ లో చిక్కుకున్న వ్యక్తిని బయటకు తీసుకు వచ్చారు. ప్రథమ చికిత్స కోసం అతడిని ఆసుపత్రికి తరలించారు.
