దేశ ప్రధాని(Prime Minister) భద్రతకు సంబంధించిన‌ బాధ్యత వహించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (Special Protection Group) డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా(Arun Kumar Sinha) బుధవారం ఉదయం మరణించారు. 61 ఏళ్ల సిన్హా అనారోగ్య కారణాలతో గురుగ్రామ్‌లోని(Gurugram) మేదాంత ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.

దేశ ప్రధాని(Prime Minister) భద్రతకు(Security) సంబంధించిన‌ బాధ్యత వహించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (Special Protection Group) డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా(Arun Kumar Sinha) బుధవారం ఉదయం మరణించారు. 61 ఏళ్ల సిన్హా అనారోగ్య కారణాలతో గురుగ్రామ్‌లోని(Gurugram) మేదాంత ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. కేరళ కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సిన్హాకు ఇటీవల ఎస్పీజీ డైరెక్టర్‌గా ఏడాది పొడిగింపు లభించింది.

అరుణ్ కుమార్ సిన్హా మార్చి 2016 నుంచి ఎస్పీజీ చీఫ్‌గా పనిచేస్తున్నారు. ప్రధానమంత్రి, మాజీ ప్రధానికి సంబంధించి ఎస్పీజీ భద్రతా బాధ్యతలు చూస్తుంది. అరుణ్ కుమార్ సిన్హా కేరళలో పోలీస్ స్పెషల్ సర్వీసెస్ అండ్ ట్రాఫిక్ అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. ఆ తర్వాతే కేంద్రానికి డిప్యూటేషన్‌పై పిలిచారు. సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్)లో ఏడాదిపాటు పనిచేశారు. ఎకె సిన్హా దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు బలగాల నుంచి ఎంపిక చేయబడిన సుమారు 3,000 మంది క్రాక్ కమాండోల బృందానికి కూడా నాయకత్వం వహించారు.

Updated On 6 Sep 2023 2:30 AM GMT
Ehatv

Ehatv

Next Story