విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ (Parliament) ఉభయసభలు దద్దరిల్లాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీపై అనర్హత వేటు సహా పలు అంశాలపై విపక్షాలు ఆందోళనకు దిగడంతో ఉభయ సభలు నిమిషానికే వాయిదా పడ్డాయి. రాహుల్‌పై అనర్హత వేటు, అదానీ వ్యవహారంపై ప్రతిపక్ష సభ్యులు గట్టిగా నినాదాలు చేశాయి. ప్ల కార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. కొందరు సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు.
విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ (Parliament) ఉభయసభలు దద్దరిల్లాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీపై అనర్హత వేటు సహా పలు అంశాలపై విపక్షాలు ఆందోళనకు దిగడంతో ఉభయ సభలు నిమిషానికే వాయిదా పడ్డాయి. రాహుల్‌పై అనర్హత వేటు, అదానీ వ్యవహారంపై ప్రతిపక్ష సభ్యులు గట్టిగా నినాదాలు చేశాయి. ప్ల కార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. కొందరు సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. రాహుల్‌పై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్‌తో పాటు మిగతా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు నల్ల దుస్తులతో సభకు హాజరయ్యారు. అదానీ వ్యవహారంలో రాహుల్‌గాంధీని మాట్లాడనివ్వకుండా చేసిన తీరుపై చర్చకు కాంగ్రెస్ (Congress) పట్టుబడుతోంది. ఈ మేరకు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. పరిస్థితి గందరగోళంగా మారడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అంతకు ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో విపక్ష ఎంపీలు భేటి అయ్యారు. ఈ సమావేశానికి డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, జేడీయూ, ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన (ఉద్ధవ్ వర్గం), తృణమూల్ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు హాజరయ్యాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి టీఎంసీ గత కొంతకాలంగా దూరంగా ఉంటోంది. బీఆర్‌ఎస్ కూడా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటోంది. అలాంటిది ఈ రెండు పార్టీలు సమావేశానికి హాజరుకావడం ఆసక్తికర పరిణామం.