ఇండియా కూటమిలోని పార్టీల(INDIA Party alliances) మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయా? సమాజ్‎వాదీ పార్టీ(Samajwadi Party) ఇండియా కూటమికి దూరమవుతుందా? నరేంద్ర మోదీ(Narendra modi) నేతృత్వంలోని ఎన్డీయే సర్కాను గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమికి ఆదిలోనే హంసపాదు పడిందా?

ఇండియా కూటమిలోని పార్టీల(INDIA Party alliances) మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయా? సమాజ్‎వాదీ పార్టీ(Samajwadi Party) ఇండియా కూటమికి దూరమవుతుందా? నరేంద్ర మోదీ(Narendra modi) నేతృత్వంలోని ఎన్డీయే సర్కాను గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమికి ఆదిలోనే హంసపాదు పడిందా? ఇండియా కూటమికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‎ పార్టీపై ఎస్పీ అధినేత అఖిలేష్(Akhilesh Yadav) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇంతకీ పార్టీల మధ్య భేదాభిప్రాయాలు రావడానికి కారణం ఏంటి?

కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్‌ను 2024 సార్వత్రిక ఎన్నికల్లో గద్దె దించడమే లక్ష్యంగా ఇండియా కూటమి ఏర్పడింది. కాంగ్రెస్(Congress) సహా వివిధ రాష్ట్రాల్లోని పార్టీలన్నీ ఇండియా కూటమిగా ఒక తాటిపైకి వచ్చాయి. కూటమి ఏర్పాటు కావడం, సమావేశాలు నిర్వహించుకోవడం వరకు బాగానే ఉన్నాయి. కానీ సీట్ల పంపిణీ దగ్గరే అసలు సమస్య మొదలైంది. ఈ క్రమంలోనే సమాజ్‌వాదీ పార్టీ అలకబూనింది. దీంతో ఇండియా కూటమి నుంచి ఆ పార్టీ తప్పుకుంటున్నట్టు వార్తలు ఊపందుకున్నాయి. మోసపూరిత పార్టీ కాంగ్రెస్ అంటూ మధ్య ప్రదేశ్ లో జరిగిన బహిరంగ ర్యాలీలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.

ఆదిలోనే ఇండియా కూటమికి బీటలు వారుతున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
కేంద్రంలోని మోదీ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలన్న ఆశయంతో జట్టు కట్టిన పార్టీలు.. ఆచరణలో మాత్రం ఆ టీమ్ వర్క్ కనిపించడం లేదు. కొన్ని అంశాలపై కూటమిలోని పార్టీల మధ్య అభిప్రాయ బేధాలు వస్తున్నాయి. ముఖ్యంగా సీట్ల సర్దుబాటు విషయంలో పార్టీల మధ్య సఖ్యత లేకపోవడమే భేదాభిప్రాయాలకు కారణం. అయితే కాంగ్రెస్ పార్టీతో జాతీయ స్థాయిలో కూటమిలోని అన్ని పార్టీలు కలిసే ఉన్నప్పటికీ..రాష్ట్రాల్లో మాత్రం నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‎లో జరుగుతున్న సాధారణ ఎన్నికలు కూటమికి మరో తలనొప్పి తెచ్చిపెట్టాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము బలంగా ఉన్న స్థానాల్లో కాంగ్రెస్‎తో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లాలని సమాజ్‌వాదీ పార్టీ భావించింది. కానీ సీట్ల సర్దుబాటు విషయంలోనే రెండు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. తాము బలంగా ఉన్న 9 స్థానాలను కేటాయించాలని ఎస్పీ కోరగా..6 స్థానాలు ఇవ్వడానికి ఒప్పుకుంది. కానీ పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరగడంతో ఎస్పీని ఏ మాత్రం సంప్రదించకుండానే ఏకపక్షంగా మొత్తం సీట్లను ప్రకటించింది. దీంతో పొత్తులో భాగంగా టికెట్లు ఆశించి భంగపడిన ఎస్సీ అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తమని మోసం చేసిందంటూ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, ఎస్పీల మధ్య పొత్తు బెడిసికొట్టడంతో ఇండియా కూటమి నుంచి తప్పుకోవాలని అఖిలేష్ యాదవ్ యోచిస్టున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ చేసింది ద్రోహమని.. బహిరంగంగా మాటల తూటాలు పేలుస్తున్నారు అఖిలేష్ యాదవ్. ఇలాంటి గందరగోళం కొనసాగితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఇండియా కూటమి ఎప్పటికీ ఓడించలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో కూటమి ఉండదని ముందే తెలిస్తే.. అసలు ఇండియా(INDIA) కూటమితో కలిసేవాడినే కాదంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఇలాగే వ్యవహరిస్తే వారితో ఎవరు నిలబడతారన్న అఖిలేష్ యాదవ్ వ్యాక్యలు కూటమి ఐక్యతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.

Updated On 6 Nov 2023 1:56 AM GMT
Ehatv

Ehatv

Next Story