మనవాళ్లు బ్యాంకాక్‌(Bankok) మీద మనసు పారేసుకుంటున్నారు. కాసింత తీరిక, చేతినిండా డబ్బుంటే చాలు బ్యాంకాక్‌కు పరుగులు తీస్తున్నారు. ఏముందని బ్యాకాంక్‌కు వెళుతున్నారని అడిగితే అక్కడ ఏమి లేదో చెప్పండి అని ఎదురు ప్రశ్నిస్తారు. అంతగా బ్యాంకాక్‌ మీద మోజు పెంచుకున్నారు. ప్రకృతి(Nature) రమణీయతను ఆస్వాదించడానికే తాము బ్యాంకాక్‌కు వెళుతున్నామని చెబుతున్నారే కానీ అంతకు మించినదేదో అక్కడ ఉంది కాబట్టే బ్యాంకాక్‌కు క్యూ కడుతున్నారు.

మనవాళ్లు బ్యాంకాక్‌(Bankok) మీద మనసు పారేసుకుంటున్నారు. కాసింత తీరిక, చేతినిండా డబ్బుంటే చాలు బ్యాంకాక్‌కు పరుగులు తీస్తున్నారు. ఏముందని బ్యాకాంక్‌కు వెళుతున్నారని అడిగితే అక్కడ ఏమి లేదో చెప్పండి అని ఎదురు ప్రశ్నిస్తారు. అంతగా బ్యాంకాక్‌ మీద మోజు పెంచుకున్నారు. ప్రకృతి(Nature) రమణీయతను ఆస్వాదించడానికే తాము బ్యాంకాక్‌కు వెళుతున్నామని చెబుతున్నారే కానీ అంతకు మించినదేదో అక్కడ ఉంది కాబట్టే బ్యాంకాక్‌కు క్యూ కడుతున్నారు. పార్టీలకు అదో స్వర్గధామం. 2022-2023 మధ్యకాలంలో థాయ్‌లాండ్‌లో(Thailand) ఇండియన్‌ గెస్టుల బుకింగ్స్‌ ఏడాదికి 60 శాతానికి పెరిగాయట! ఎంజాయ్‌మెంట్‌కు బ్యాంకాక్‌కు మించినది లేదన్నది యూత్‌ భావన! థాయ్‌లాండ్‌కు భారత్‌ అయిదో అతి పెద్ద ఇన్‌బౌండ్‌ మార్కెట్‌గా ఉంది. అన్నట్టు థాయ్‌లాండ్‌ ప్రభుత్వం మనకో సదవకాశాన్ని కూడా కలిగించింది. వీసా(Visa) లేకుండానే థాయ్‌లాండ్‌కు వెళ్లిరావచ్చు. అందుకే ఇండియన్‌ టూరిస్టులు బాగా పెరిగారు. ఈ ఏడాది నవంబర్‌ వరకు వీసా రహిత విధానం ఉంటుంది. పైగా నాలుగు గంటల్లో థాయ్‌లాండ్‌కు వెళ్లిపోవచ్చు. రోజువారీ విమానాలు బోల్డన్నీ అందుబాటులో ఉంటున్నాయి. 2023లో 80 శాతం బుకింగ్స్‌ యువతేనని ఎయిర్‌ బీఎన్‌బీ డేటా చెబుతోంది. థాయ్‌లాండ్‌లో ఇండియన్స్‌ ఎక్కువగా ఎంపిక చేసుకున్న టాప్‌ ఫైవ్‌ ప్లేసులలో రాజధాని నగరం బ్యాంకాక్‌ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. పుకెట్‌, చియాంగ్‌ మాయి, క్రాబి, స్యామ్యూయ్‌లు ఉన్నాయి.
పొడిగించింది.

Updated On 11 Jun 2024 2:05 AM GMT
Ehatv

Ehatv

Next Story