కొత్త దంపతులను ఆశీర్వదిస్తూ గంపెడు మంది పిల్లల్ని(chidren) కనండనేవారు!
కొత్త దంపతులను ఆశీర్వదిస్తూ గంపెడు మంది పిల్లల్ని(chidren) కనండనేవారు! అప్పట్లో సంతానాన్ని సౌభాగ్యంగా భావించేవారు. ఏడో దశకం నుంచి కుటుంబ నియంత్రణ( family planning) అమలులోకి వచ్చింది. దక్షిణ భారతీయులు(south india), మరీ ముఖ్యంగా తెలుగువారు(te) సంతానం విషయంలో చాలా జాగ్రత్తపడ్డారు. ఇద్దరితో పుల్‌స్టాప్ పెట్టేవారు. ఎనిమిదో దశకానికి వచ్చేసరికి ఆలుమగలు కుటుంబనియంత్రణను శ్రద్ధగా పాటించారు. దాంతో ఇప్పుడు దక్షిణభారతదేశంలో 40 ఏళ్ల వయసువారు తక్కువగా ఉంటారు. ఈ ప్రభావం లోక్‌సభ(Lok sabha) సీట్ల పునర్విభజనపై పడుతున్నది. ఫలితంగా దక్షిణ భారతంలో ఎంపీ సీట్లు తక్కువ సంఖ్యలో పెరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కలుపుకుంటే మహా అయితే మూడు సీట్లు పెరుగుతాయంతే! తమిళనాడులో అయితే దారుణం. రెండే రెండు లోక్‌సభ సీట్లు పెరగనున్నాయి. ప్రస్తుతం 39 లోక్‌సభ స్థానాలు ఉన్న తమిళనాడులో(Tamilnadu) ఈ సంఖ్య 41కి చేరనుంది. కేరళలో ఒక్క లోక్‌సభ సీటు కూడా పెరిగే ఛాన్స్ లేదు. కుటుంబనియంత్రణ పాటించిన నేరానికి దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోనుంది. అదే ఉత్తరప్రదేశ్‌ను తీసుకుంటే అక్కడ ఇప్పటికే 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. పునర్విభజన జరిగిన తర్వాత సీట్ల సంఖ్య 126కు పెరగనుంది. బీహార్, మధ్యప్రదేశ్‌లలో కూడా ఇదే పరిస్థితి. ఇబ్బడి ముబ్బడిగా పిల్లలను కన్నందుకు లోక్‌సభ సీట్లు పెరుగుతున్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలలో కలిపి నాలుగైదు లోక్‌సభ స్థానాలు పెరిగితే, ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 46 లోక్‌సభ స్థానాలు పెరగబోతున్నాయి. అంటే ఉత్తరాదిన గెలిచిన పార్టీ ఈజీగా అధికారంలోకి వచ్చేస్తుంది. సౌత్ ఇండియాలో సీట్లు రాకపోయినా ఫర్వాలేదు. మంది తప్ప మరేమీ లేని ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో ఎక్కువ స్థానాలు గెల్చుకుంటే అధికారం హస్తగతం చేసుకోవచ్చు. అందుకే తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే.స్టాలిన్ కాస్త వ్యంగంగా, కాస్త చమత్కారంగా ఓ వ్యాఖ్య చేశారు. దానికే హిందీ మీడియా ఆక్రందనలు చేస్తోంది. పెడబొబ్బలు పెడుతోంది. నేషన్ వాంట్స్ టు నో అంటూ గావుకేకలు పెడుతోంది. రీసెంట్‌గా తమిళనాడు ప్రభుత్వ ఆధ్వరంలో జరిగిన పెళ్లిళ్ల కార్యక్రమానికి స్టాలిన్ హాజరయ్యారు. వెనకటికి 16 మంది పిల్లలను కనమని దీవించేవారని, ఎంపీ సీట్ల సంఖ్య పెరగాలంటే ఇప్పుడు మళ్లీ ఆ దీవెన అవసరం పడేట్టుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. చమత్కరించినప్పటికీ స్టాలిన్ మాటల్లో నిజం ఉంది. 16 మంది పిల్లలను కనాలంటూ తమిళనాడు ప్రభుత్వం నిర్బంధ చట్టం తెచ్చినట్టుగా జాతీయ మీడియా రెచ్చిపోయింది.