శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌక‌ర్యార్ధం దక్షిణ మధ్య రైల్వే 22 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.

శబరిమల(Sabarimala)కు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌక‌ర్యార్ధం దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) 22 ప్రత్యేక రైళ్లు(Special Trains) నడపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రైళ్ల‌లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీ బోగీలతో పాటు స్లీపర్, జనరల్ కోచ్‌లు ఉంటాయి. కావున భ‌క్తులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని రైల్వే శాఖ కోరింది.

రైళ్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి..

నవంబర్ 26తో పాటు డిసెంబరు 3 తేదీల్లో సికింద్రాబాద్‌-కొల్లం స్పెషల్‌ ట్రైన్‌ నెంబర్‌ 07129/07130 సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు రాత్రి 11.55కి కొల్లాం చేరుకుంటుంది. అదే ట్రైన్‌ నవంబర్‌ 28, డిసెంబర్‌ 5 తేదీల్లో తిరుగు ప్రయాణం ఉంటుంది. కొల్లాంలో తెల్లవారుజామున 2.30 గంటలకి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 8.55కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

నర్సాపూర్‌-కొట్టాయం ట్రైన్‌ నెంబర్‌ 07119/07120 నవంబర్‌ 26, డిసెంబరు 3 తేదీల్లో న‌ర్సాపూర్ నుంచి మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు సాయంత్రం 4.50 గంటలకు కొట్టాయంకు చేరుకుంటుంది. అదే ట్రైన్‌ తిరుగు ప్రయాణంలో నవంబర్‌ 27, డిసెంబర్‌ 4 తేదీల్లో కొట్టాయం నుంచి సాయంత్రం 7 గంటలకి బయల్దేరి.. మరుసటి రోజు రాత్రి 9 గంట‌ల‌కు నర్సాపూర్‌కు చేరుకుంటుంది.

కాచిగూడ-కొల్లం ట్రైన్‌ నెంబర్‌ 07123/07124 నవంబర్‌ 22, 29, డిసెంబరు 6 తేదీల్లో కాచిగూడలో సాయంత్రం 5.30కి బయల్దేరి.. మరుస‌టి రోజు రాత్రి 11.55 గంటలకి కొల్లాంకు చేరుకుంటుంది. అదే ట్రైన్ తిరుగు ప్రయాణంలో నవంబర్‌ 24, డిసెంబర్‌ 1, 8 తేదీల్లో కొల్లం నుంచి తెల్లవారు జామున 2.30 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

కాకినాడ-కొట్టాయం ట్రైన్‌ నెంబర్‌ 07125/07126 న‌వంబ‌ర్‌ 23, 30 తేదీల్లో సాయంత్రం 5.40 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకి కొట్టాయంకు చేరుకుంటుంది. అదే ట్రైన్ తిరుగు ప్రయాణంలో నవంబర్‌ 25, డిసెంబర్‌ 2 తేదీల్లో కొట్టాయం నుంచి రాత్రి 12.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది.

సికింద్రాబాద్‌-కొల్లం ట్రైన్‌ నెంబర్‌ 07127/07128 నవంబర్‌ 24, డిసెంబరు 1 తేదీల్లో సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకి బయలుదేరి.. మర్నాడు సాయంత్రం 7.30కి కొల్లాం చేరుకుంటుంది. అదే ట్రైన్ తిరుగు ప్రయాణంలో నవంబర్‌ 25, డిసెంబర్‌ 2 తేదీల్లో కొల్లాం నుంచి రాత్రి 11 గంట‌ల‌కు బయల్దేరి మ‌రుస‌టి రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.

Updated On 20 Nov 2023 9:32 PM GMT
Yagnik

Yagnik

Next Story