ప్రయాణికులను దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అలర్ట్ చేసింది. విజయవాడ(Vijayawada) మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చూసినట్టు ప్రకటించింది. విజయ­వాడ డివిజన్‌లో చేపట్టనున్న ట్రాక్‌ నిర్వహణ పనుల(Track Works) కారణంగా పలు రైళ్లు పూర్తిగాను, కొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు.

ప్రయాణికులను దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అలర్ట్ చేసింది. విజయవాడ(Vijayawada) మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చూసినట్టు ప్రకటించింది. విజయ­వాడ డివిజన్‌లో చేపట్టనున్న ట్రాక్‌ నిర్వహణ పనుల(Track Works) కారణంగా పలు రైళ్లు పూర్తిగాను, కొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు విజయవాడ డివిజన్‌ పీఆర్‌వో నుస్రత్‌ మండ్రుప్కర్‌(Nusrat Mandrupkar) శనివారం వెల్లడించారు. ఈ నెల 29నుంచి ఫిబ్రవరి 25 వరకు గుంటూరు–విశాఖ (17239/17240), కాకినాడ పోర్టు–విశాఖ (172­67­/­17268), మచిలీపట్నం– విశాఖ (17219/17220), గుంటూరు–రాయగఢ్‌ (17243/ 17244), బిట్రగుంట–విజయవాడ (07977/ 07978) రైళ్లు రద్దు చేశారు. బిట్రగుంట– చెన్నై సెంట్రల్‌ (17237/17238) రైళ్లు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు, 5 నుంచి 9 వరకు, 12 నుంచి 16 వరకు, 19 నుంచి 23 వరకు రద్దు చేశారు. అలాగే.. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 25 వరకు మచిలీపట్నం–విజయవాడ (07896/07769), నర్సాపూర్‌–విజయవాడ (07863), విజయవాడ–మచిలీపట్నం (07866), మచిలీపట్నం–విజయవాడ (07770), విజయవాడ–భీమవరం జంక్షన్‌ (07283), మచిలీపట్నం–విజయవాడ (07870), విజయవాడ–నర్సాపూర్‌ (07861) రైళ్లు రామవరప్పాడు నుంచి బయలుదేరి, తిరుగు ప్రయాణంలో కూడా ఈ స్టేషన్‌ వరకే నడవనున్నాయి.

Updated On 21 Jan 2024 1:43 AM GMT
Ehatv

Ehatv

Next Story