నాలుగు దేశాలు పాల్గొనే టర్కిస్ కప్(Turkey's Cup) అంతర్జాతీయ మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్ (Female football Tournament)
టర్కీలోని అలాన్యా పట్టణంలో బుధవారం ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత సీనియర్ జట్టను ప్రకటించారు
నాలుగు దేశాలు పాల్గొనే టర్కిస్ కప్(Turkey's Cup) అంతర్జాతీయ మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్ (Female football Tournament)
టర్కీలోని అలాన్యా పట్టణంలో బుధవారం ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత సీనియర్ జట్టను ప్రకటించారు. 23 మంది సభ్యులతో కూడిన ఇండియన్ టీమ్‌లో తెలంగాణకు చెందిన పార్వర్డ్ ప్లేయర్ సౌమ్య గుగులోత్‌కు(Soumya Gugulot) స్థానం దక్కింది. ఇండియాతో పాటు హాంకాంగ్, ఎస్టోనియా, కొసోవో దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. టాప్ ప్లేస్‌లో నిలిచిన జట్టుకు టైటిల్ లభిస్తుంది. భారత్ తన తొలి మ్యాచ్‌ను ఈ నెల 21వ తేదీన ఎస్టోనియాతో ఆడుతుంది. 24వ తేదీన హాంకాంగ్‌తో, 27వ తేదీన కొసోవోతో తలపడుతుంది.