లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) దగ్గరపడుతుండటంతో పార్టీలన్నీ అందుకు సమాయత్తమవుతున్నాయి. తెలంగాణలో మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో తలమునకలైన పార్టీలు ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల కోసం కసరత్తులు చేస్తున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి మల్కాజ్‌గిరి(Malkajgiri) లోక్‌సభ స్థానంపైనే ఉంది. తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్‌ మొన్నామధ్య ఓ సమావేశం పెట్టుకుని సోనియాగాంధీని(Sonia Gandhi) తెలంగాణ పోటీ చేయాలని కోరుతూ ఓ తీర్మానం చేసింది. ఆ విధంగా ఆమె పట్ల తమకు ఉన్న విధేయతను చాటుకుంది. ఈసారి ఎన్నికల్లో సోనియా పోటీ చేయడం అనుమానమే! తన వయసు, అనారోగ్యం దృష్ణా ఆమె ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండవచ్చు.

లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) దగ్గరపడుతుండటంతో పార్టీలన్నీ అందుకు సమాయత్తమవుతున్నాయి. తెలంగాణలో మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో తలమునకలైన పార్టీలు ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల కోసం కసరత్తులు చేస్తున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి మల్కాజ్‌గిరి(Malkajgiri) లోక్‌సభ స్థానంపైనే ఉంది. తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్‌ మొన్నామధ్య ఓ సమావేశం పెట్టుకుని సోనియాగాంధీని(Sonia Gandhi) తెలంగాణ పోటీ చేయాలని కోరుతూ ఓ తీర్మానం చేసింది. ఆ విధంగా ఆమె పట్ల తమకు ఉన్న విధేయతను చాటుకుంది. ఈసారి ఎన్నికల్లో సోనియా పోటీ చేయడం అనుమానమే! తన వయసు, అనారోగ్యం దృష్ణా ఆమె ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండవచ్చు. రాయ్‌బరేలీ(Rae Bareli) నుంచి కూడా పోటీ చేయకపోవచ్చు. అక్కడ్నుంచి ప్రియాంకగాంధీ(Priyanka Gandhi) బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ సోనియా తెలంగాణ నుంచి పోటీ చేయాలనుకుంటే మాత్రం ఒకప్పుడు ఇందిరాగాంధీ పోటీ చేసిన మెదక్‌ను(Medak) ఎంచుకోవచ్చు. సెంటిమెంట్‌ పరంగా కూడా వర్క్‌అవుట్‌ అవుతుంది. మెదక్‌ ఇప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట కాదు. ఎంతకాదనుకున్నా బీఆర్‌ఎస్‌(BRS) అక్కడ స్ట్రాంగ్‌గానే ఉంది. ఒకవేళ కాంగ్రెస్‌ గెలవకపోతే, పరువు పోతుంది. తెలంగాణలో కాంగ్రెస్‌ తలెత్తుకుని తిరగలేదు. అంచేత కాంగ్రెస్‌ బలంగా ఉన్న నల్లగొండ(Nalgonda) నుంచో, ఖమ్మం నుంచో పోటీ చేయిస్తే నెమ్మదిగా ఉండవచ్చని కొందరు సూచించారు. ఎన్నిక రసవత్తరంగా, ఉత్కంఠభరితంగా ఉండాలంటే మాత్రం సోనియాగాంధీ మెదక్‌ నుంచి పోటీ చేయడమే ఉత్తమం. ఎందుకంటే అక్కడి నుంచి కేసీఆర్‌ కూడా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారట! కాంగ్రెస్‌కు చెందిన మరో వర్గం సోనియాను మల్కాజ్‌గిరి(Malkajgiri) నుంచి పోటీ చేయించాలని అనుకుంటోంది. దేశంలోనే పెద్ద నియోజకవర్గంగా పేరొందిన మల్కాజ్‌గిరిలో అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. నిన్నమొన్నటి వరకు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సభ్యుడిగా ఉన్నారు. కొంచెం కష్టపడితే సోనియాగాంధీ విజయం సాధించవచ్చు. కేసీఆర్‌(KCR) కూడా ఇక్కడి నుంచి పోటీ చేయడమే శ్రేయస్కరం. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలలో బీఆర్‌ఎస్‌కు ఘన విజయాలు లభించాయి. ఇదే ఊపు లోక్‌సభ ఎన్నికల వరకు ఉండవచ్చు. అన్నట్టు తెలంగాణ బీజేపీ కూడా ప్రధాని నరేంద్రమోదీని(Narendra Modi) తెలంగాణ నుంచి పోటీ చేయించాలని ఉత్సాహపడుతోంది. దక్షిణాదిన బీజేపీకి జోష్‌ రావాలంటే మోదీ ఇక్కడి నుంచి బరిలో దిగాలని చాలా మంది ప్రతిపాదించారు కూడా! వారణాసితో పాటు తెలంగాణ నుంచో, తమిళనాడు నుంచో పోటీ చేయాలన్నది వారి అభిప్రాయం. తమిళనాడులో బీజేపీకి అంతబలం లేదు కాబట్టిమల్కాజ్‌గిరి అయితేనే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇదే జరిగితే మల్కాజ్‌గిరిపై దేశం దృష్టి పడుతుంది. నరేంద్రమోదీ, సోనియాగాంధీ, కేసీఆర్‌ పోటీపడితే ... ఊహించుకుంటేనే అదిరిపోతున్నది. మొన్న కామారెడ్డిలో కేసీఆర్‌, రేవంత్‌ తలపడితే ఎంత ఉత్కంఠ రేగిందో అంతకు వందరెట్లు మోదీ, సోనియా, కేసీఆర్‌ త్రయం పోటీపడితే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు!

Updated On 26 Dec 2023 5:06 AM GMT
Ehatv

Ehatv

Next Story