మహారాష్ట్రలోని(Maharastra) నాగ్‌పూర్‌లోని(Nagpur) బజార్‌గావ్ సమీపంలోని సోలార్ కంపెనీలో(Solar company) ఆదివారం ఉదయం పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ పేలుడులో తొమ్మిది మంది మృతి చెందగా, ముగ్గురు గాయపడినట్లు సమాచారం. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పేలుడు సంభవించిన సమయంలో సోలార్ కంపెనీ యూనిట్‌లో మొత్తం 12 మంది ఉద్యోగులు ఉన్నారు. సంస్థకు చెందిన‌ కాస్ట్ బూస్టర్ ప్లాంట్‌లో పేలుడు సంభవించింది.

ఈ కంపెనీలో డిటోనేటర్లు, పేలుడు పదార్థాలను తయారు చేస్తారు. కార్మికులు కొన్ని పేలుడు పదార్థాలను ప్యాక్ చేస్తున్నారు. ఇంతలో ప్లాంట్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 9 మంది కూలీలు ప్రాణాలు కోల్పోగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

సోలార్ కంపెనీలో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. మృతదేహాలను(Deadbodies) బయటకు తీసిన పోలీసులు వాటిని పోస్టుమార్టంకు తరలించారు. అలాగే క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

నాగ్‌పూర్‌లోని బజార్‌గావ్ గ్రామంలో సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో పేలుడు సంభవించిందని.. అందులో తొమ్మిది మంది మరణించారని నాగ్‌పూర్ రూరల్ ఎస్పీ హర్ష్ పొద్దార్ తెలిపారు. సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీకి చెందిన కాస్ట్ బూస్టర్ ప్లాంట్‌లో కార్మికులు ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించిందని వెల్ల‌డించారు. కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నామ‌ని తెలిపారు.

Updated On 17 Dec 2023 2:09 AM GMT
Ehatv

Ehatv

Next Story