తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్రమాణం చేశారు. కార్యరంగంలోకి కూడా దూకేశారు. దూకుడు ప్రదర్శిస్తున్నారు. మొన్నటి నుంచి సోషల్ మీడియాలో రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమ దృశ్యాలు వెల్లువెత్తాయి. అదే సమయంలో మరో టాపిక్ కూడా వైరల్ అవుతోంది. ప్రమాణ స్వీకారం సమయంలో ప్రియాంక గాంధీ(Priyanka Gandhi), రాహుల్‌గాంధీ(Rahul Gandhi) వెనక కూర్చున్న యువతి ఎవరనే చర్చ నడిచింది.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్రమాణం చేశారు. కార్యరంగంలోకి కూడా దూకేశారు. దూకుడు ప్రదర్శిస్తున్నారు. మొన్నటి నుంచి సోషల్ మీడియాలో రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమ దృశ్యాలు వెల్లువెత్తాయి. అదే సమయంలో మరో టాపిక్ కూడా వైరల్ అవుతోంది. ప్రమాణ స్వీకారం సమయంలో ప్రియాంక గాంధీ(Priyanka Gandhi), రాహుల్‌గాంధీ(Rahul Gandhi) వెనక కూర్చున్న యువతి ఎవరనే చర్చ నడిచింది. ప్రియాంక, రాహుల్‌గాంధీల వైపు టీవీ కెమెరాలు ఫోకస్ చేస్తాయి కాబట్టే వారి వెనుక కూర్చున్న ఆ అందమైన యువతి కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటి వరకు మనమెప్పుడు చూడని ఆ యువతి ఎవరు? రాజకీయాలతో ఆమెకు ఏమిటి సంబంధం? తెలంగాణతో ఆమెకున్న అనుబంధం ఏమిటి? అధినాయకత్వానికి అంత దగ్గరి మనిషా? అన్న అనుమానాలు చాలా మందికి కలిగాయి. ఇంతకీ ఎవరామె?
ఆ 43 ఏళ్ల యువతి పేరు ప్రణితి షిండే(Praniti Shinde)..మహారాష్ట్రలోని సోలాపూర్ సిటీ సెంట్రల్ ఎమ్మెల్యే. మన సరిహద్దులోనే ఉంటుందా పట్టణం. సోలాపూర్‌లో చాలా మంది తెలంగాణవాళ్లు ఉంటారు. అక్కడ్నుంచి ఆమె మూడుసార్లు విజయం సాధించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పని చేసిన సుశీల్ కుమార్ షిండే కూతురామె! ఆ విధంగా ఆయనకు తెలుగువారితో సంబంధం కూడా ఉంది. ఆయనకు ముగ్గురు కూతుళ్లు. వారిలో ప్రణితి చిన్నమ్మాయి. సుశీల్‌కుమార్ షిండే రాజకీయాల నుంచి వైదొలిన తర్వాత ప్రణితి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి రాక మునుపు కూడా Jai Jui అనే స్వచ్చంధ సంస్థ ద్వారా ప్రజలలో ఉండేవారు. 28 ఏళ్లకే మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. పాలిటిక్స్‌లో చాలా యాక్టివ్. రేవంత్‌రెడ్డి మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ హైకమాండ్ పెద్దలతో పాటు ప్రణతి కూడా వచ్చారు. మహారాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆమె ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2019లో సుశీల్‌కుమార్ షిండే షోలాపూర్ లోక్‌సభ నుంచి పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి శ్రీసిద్ధేశ్వర్ మహారాజ్ చేతిలో ఓడిపోయారు. తన తండ్రి పరాజయానికి ప్రణితి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో షోలాపూర్ లోక్‌సభ నుంచి పోటీ చేయబోతున్నారు. షోలాపూర్ మనకు సరిహద్దులోనే ఉంటుంది కాబట్టి తెలంగాణ నుంచి చాలా మంది చేనేత కార్మికులు ఉపాధి కోసం అక్కడికి వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. అంటే తెలంగాణకు షోలాపూర్‌కు సంబంధం ఉందన్నమాటే కదా! అందుకే ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రణితి వచ్చారు.