ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ఆగ్రాలో(Aagra) ఓ పురాతనమైన ఇల్లు(Ancient House). ఆ ఇంటిని ఒకాయన కొన్నాడు. కొన్నవాడు పాత ఇంట్లోనే ఉండడు కదా! దాన్ని కూల్చేసి కొత్తగా ఇల్లు కట్టుకుందామనుకున్నాడు. కూల్చివేత పనులను కూలీలకు అప్పగించాడు. వారు ఆ పురాతన భవనాన్ని కూల్చివేస్తున్నప్పుడు వారికి ఓ పెద్ద పెట్టె(Trunk) దొరికింది. చూస్తే అది కూడా పురాతనమైనదిగా కనిపించింది.
ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ఆగ్రాలో(Aagra) ఓ పురాతనమైన ఇల్లు(Ancient House). ఆ ఇంటిని ఒకాయన కొన్నాడు. కొన్నవాడు పాత ఇంట్లోనే ఉండడు కదా! దాన్ని కూల్చేసి కొత్తగా ఇల్లు కట్టుకుందామనుకున్నాడు. కూల్చివేత పనులను కూలీలకు అప్పగించాడు. వారు ఆ పురాతన భవనాన్ని కూల్చివేస్తున్నప్పుడు వారికి ఓ పెద్ద పెట్టె(Trunk) దొరికింది. చూస్తే అది కూడా పురాతనమైనదిగా కనిపించింది. తాళం వేసి ఉన్న ఆ పెట్టెలో బంగారు వెండి ఆభరణాలు ఉంటాయని కొందరు, డబ్బు దస్కం ఉంటుందని మరికొందరు ఊహించేసుకున్నారు. ఏదైతేనేమీ అనుకుని తాళం బద్దలు కొట్టారు. పెట్టె తెరచి చూసి హడలెత్తిపోయారు. బాక్సులోపల మానవ అస్థిపంజరాలుండటంతో వణికిపోయారు. పనులను ఎక్కడివక్కడే వదిలేసి తలోదిక్కు పారిపోయారు. ఇంట్లో అస్థిపంజరాలు(skeleton) దొరికాయన్న విషయం ఆ నోటా ఈ నోటా పాకింది. చివరకు పోలీసులకు కూడా తెలిసింది. వెంటనే వారు సంఘటన స్థలానికి వచ్చారు. ఆ బాక్సును లాబోరేటరీకి పంపించారు. రిపోర్టు వచ్చిన తర్వాత దర్యాప్తు చేపడతామని చెప్పారు. గతంలో ఈ ఇంట్లో ఆర్ధోపెడిక్ సర్జన్(Orthopedic Surgeon) డాక్టర్ నరేశ్ అగర్వాల్ ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. ఆయనే ఈ ఇంటిని అశోక్ అగర్వాల్ అనే వ్యక్తికి అమ్మాడట! ఆ ఇంటిని పడగొడుతున్నది అశోక్ అగర్వాలే! ఇప్పటి వరకైతే ఆ అస్థిపంజరాలు ఎవరివన్నది తేలలేదు. ఆర్థోపెడిక్ సర్జన్ కాబట్టి వృత్తిలో భాగంగా అస్థిపంజరాలను ఇంట్లో పెట్టుకున్నాడా? లేక ఇంకెవరైనా పెట్టెలో పెట్టారా అన్నది తేలాల్సి ఉంది. పోలీసులు ఇప్పుడు నరేశ్ అగర్వాల్‌తో పాటు, అశోక్ అగర్వాల్‌ను కూడా విచారిస్తున్నారు.