దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో విషాదం చోటు చేసుకుంది. దోమల బెడద నుంచి తప్పించుకోవడానికి వెలిగించిన మస్కిటో కాయిల్ (mosquito coil)ఆరుగురి ప్రాణాలను తీసింది. చనిపోయిన వారిలో ఏడాదిన్నర చిన్నారి కూడా ఉండటం మరింత విషాదం. ఈశాన్య ఢిల్లీ (delhi)లోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. దోమలు ఎక్కువగా ఉన్నాయని ఓ కుటుంబం మస్కిటో కాయిల్‌ను వెలిగించి నిద్రపోయింది.
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో విషాదం చోటు చేసుకుంది. దోమల బెడద నుంచి తప్పించుకోవడానికి వెలిగించిన మస్కిటో కాయిల్ (mosquito coil)ఆరుగురి ప్రాణాలను తీసింది. చనిపోయిన వారిలో ఏడాదిన్నర చిన్నారి కూడా ఉండటం మరింత విషాదం. ఈశాన్య ఢిల్లీ (delhi)లోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. దోమలు ఎక్కువగా ఉన్నాయని ఓ కుటుంబం మస్కిటో కాయిల్‌ను వెలిగించి నిద్రపోయింది. కుటుంబసభ్యులు అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి ప్రాంతంలో కాయిల్ పరుపుపై పడింది. నెమ్మదిగా పరుపు అంటుకుని పొగలు వ్యాపించాయి. కిటికీలు, తలుపులు పూర్తిగా మూసి ఉండటంతో పొగ దట్టంగా అలుముకుంది. ఊపిరి ఆడక వారంతా నిద్రలేచి గదిలోంచి బయటపడేందుకు ప్రయత్నించారు. ప్పటికే విషపూరితమైన వాయువు (toxic gas)గదిలో వ్యాపించింది. ఆ వాయువును పీల్చిన వారు స్పృహతప్పి పడిపోయారు. ఉదయం వారి ఇంటి నుంచి మటలు రావడం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టారు. లోపలికి వెళ్లి చూసేసరికి అప్పటికే ఆరుగురు చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం తొమ్మిది మంది గదిలో ఉన్నారు. మిగతా ముగ్గురిని పోలీసులు రక్షించి హాస్పిటల్‌లో చేర్చారు. రాత్రంతా టాక్సిక్ గ్యాస్‌ను పీల్చడం వల్ల వారు స్పృహతప్పి పడిపోయారని, ఆ తర్వాత ఊపిరి ఆడక ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు చెప్పారు.