Haryana Voilence News : హర్యానాలో జరుగుతున్నదేంటి? ఎవరి వైఫల్యం
అల్లర్లతో అట్టుడుకుతున్న హర్యానా(Haryana). చెలరేగిన అల్లర్లకు ఆరుగురు బలి. మరో 70 మంది తీవ్ర గాయాలు. ఢిల్లీకి పాకిన హర్యానా అల్లర్లు. ఢిల్లీ - ఫరీదాబాద్ రోడ్డు పై భజ్‌రంగ్ దళ్, వీహెచ్‌పీ కార్యకర్తలు ఆందోళన. భజరంగ్ దళ్ కార్యకర్తలు హనుమాన్ చాలీసాను పఠిస్తూ నిరసన వ్యక్తం చేసారు. నుహ్ జిల్లాలోని ఖేడ్లా మోర్ సమీపంలో బ్రజ్‌మండల్ జలాభిషేక్ యాత్రలో జరిగిన అల్లర్లకు కారణమైన 116 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు.
అల్లర్లతో అట్టుడుకుతున్న హర్యానా(Haryana). చెలరేగిన అల్లర్లకు ఆరుగురు బలి. మరో 70 మంది తీవ్ర గాయాలు. ఢిల్లీకి పాకిన హర్యానా అల్లర్లు. ఢిల్లీ - ఫరీదాబాద్ రోడ్డు పై భజ్‌రంగ్ దళ్, వీహెచ్‌పీ కార్యకర్తలు ఆందోళన. భజరంగ్ దళ్ కార్యకర్తలు హనుమాన్ చాలీసాను పఠిస్తూ నిరసన వ్యక్తం చేసారు. నుహ్ జిల్లాలోని ఖేడ్లా మోర్ సమీపంలో బ్రజ్‌మండల్ జలాభిషేక్ యాత్రలో జరిగిన అల్లర్లకు కారణమైన 116 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ ఘటనలపై ఏకంగా 41 ఎఫ్ఐఆర్‌లను నమోదు చేశారు. హర్యానా అల్లర్లలో ఇమామ్ సహా ఇద్దరు హోంగార్డులు, ఇద్దరు పౌరులు మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
నిఘా వైఫల్యం..?
హరియాణాలో అల్లర్లు జరగడానికి నిఘా వర్గాల వైఫల్యమే కారణమా..? ప్రస్తుతం దీనిపైనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ అంశం సుప్రంకోర్టు వరకూ వెళ్లింది. భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు CCTVలను ఏర్పాటు చేయాలని అధికారులను సుప్రంకోర్టు ఆదేశించింది. అయితే...ఇది కేవలం ఇంటిలిజెన్స్ వైఫల్యమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అటు ఇంటిలిజెన్స్ అధికారులు మాత్రం తాము ముందుగానే దీనిపై హెచ్చరికలు చేశామని తేల్చి చెబుతున్నారు.
ప్రతిపక్షాల విమర్శలు..
పోలీసులు చేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అక్కడి ఆందోళనల తీవ్రతను గమనించిన ప్రభుత్వం ఒకేసారి 700 మంది పోలీసులను పంపింది. అయితే..వారిపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడం వల్ల కొంత మంది పారిపోయి వచ్చారన్న ఆరోపణలూ ఉన్నాయి. మరో కీలక విషయం ఏంటంటే..మేవట్ ఎస్‌పీ సెలవులో ఉన్నప్పుడే ఇది జరగడం. దీనిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అల్లర్లపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INDL) నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఇలాంటివి జరుగుతాయని తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని మండి పడుతున్నాయి. అల్లర్లు జరుగుతాయని హెచ్చరించినా కేవలం హోంగార్డులను పంపి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి
అసలు అల్లర్లకు నేపథ్యం
హర్యానాలోని నుహ్ జిల్లాలోని ఖేడ్లా మోర్ సమీపంలో బ్రజ్‌మండల్ జలాభిషేక్ యాత్రను అడ్డుకునేందుకు కొందరు దుండగులు ప్రయత్నించి రాళ్లు రువ్వడంతో పాటు ఊరేగింపులో పాల్గొన్న రెండు కార్లకు నిప్పు పెట్టడం తో అల్లర్లు స్టార్ట్ అయ్యాయి. ప్రజలు దొండగులని అడ్డుకోవడంతో రాళ్ల దాడి మొదలైన కొద్దిసేపటికే చాలా చోట్లకి అల్లర్లు వ్యాపించాయని ప్రత్యేక్ష సాక్షులు చెప్తున్నారు. రేవారి, గుర్గావ్, పాల్వాల్, ఫరీదాబాద్ సహా 5 జిల్లాల్లో 144 సెక్షన్ అమలు చేయబడింది. ఇంటర్నెట్ ఆఫ్ చేయబడింది. యాత్ర గురించి ఆరు నెలల ముందుగానే అధికారులకి తెలియచేశాం అని విశ్వహిందూ పరిషత్ ఆరోపిస్తోంది. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన నాసిర్-జునైద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మోను మానేసర్ యాత్రలో పాల్గొనడం వల్లే అల్లర్లు, దాడులు చెలరేగాయని పోలీసులు చెప్తున్నారు. యాత్ర కి ముందు మోను మానేసర్ యాత్రలో పార్టిసిపేట్ చేస్తున్నట్లు సోషల్ మీడియా లో వైరల్ కావడంతో, అతను యాత్రలో పార్టిసిపేట్ చేస్తే నిరసనలు తెలుపుతాం అని మరో వర్గ హెచ్చరికలు చేసినా పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మోను మానేసర్ హర్యానాలో గతంలో జరిగిన ఇద్దరి ముస్లింల హత్య కేసుల్లో నిందితుడు కావడంతో అదును కోసం చూసిన మరో వర్గం దాడులకు పాల్పడింది అని విశ్వహిందూ పరిషత్ ఆరోపిస్తుంది.
సోషల్ మీడియాలో ఇరు పక్షాల నుండి రెచ్చగొట్టే పోస్టులు
అల్లర్లకు ముందు రెండు రోజులు రెండు వర్గాల మధ్య సోషల్ మీడియా లో రెచ్చగొట్టే ప్రకటనలు ఫార్వర్డ్ అయ్యాయని, అయితే దీన్ని ప్రభుత్వ నిఘా వ్యవస్థ లైట్ గా తీసుకోవడంవల్లే అల్లర్లు చెలరేగి, ఢిల్లీ దాకా వ్యాపించాయనే విమర్శ ఉంది. ఈ ఆందోళనను అదుపు చేయడంలో పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని స్థానికులు అంటున్నారు. 5 నుంచి 6 గంటల ఆందోళన తర్వాత కూడా భద్రతా బలగాలు, అదనపు బలగాలు ఘటనా స్థలానికి చేరుకోలేకపోయాయి స్థానికులు మండిపడుతున్నారు