దేశంలో 24 గంటల్లో 702 కొత్త కోవిడ్‌ (Covid-19) కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య మొత్తం 4,097కు చేరింది. కొత్తగా ఆరు మరణాలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతుండగా మరోవైపు, JN-1 (JN.1) వేరియంట్‌ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి

దేశంలో 24 గంటల్లో 702 కొత్త కోవిడ్‌ (Covid-19) కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య మొత్తం 4,097కు చేరింది. కొత్తగా ఆరు మరణాలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతుండగా మరోవైపు, JN-1 (JN.1) వేరియంట్‌ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. దేశంలో కోవిడ్‌-19 కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది మరోవైపు పాజిటివ్ కేసులు కూడా భారీ గానే పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ JN.1 కారణం గానే దేశంలో కరోనా కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోందని నిపుణులు చెప్తున్నారు. మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లతో జేఎన్‌.1 వేరియంట్‌ నుంచి కూడా సేవ్ చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.

Updated On 29 Dec 2023 12:59 AM GMT
Ehatv

Ehatv

Next Story