గుజరాత్‌(Gujarat) వణికిపోతున్నది. చాందిపురా వైరస్‌(Chandipura) వ్యాప్తి చెందుతుండటంతో ఆందోళన చెందుతోంది.

గుజరాత్‌(Gujarat) వణికిపోతున్నది. చాందిపురా వైరస్‌(Chandipura) వ్యాప్తి చెందుతుండటంతో ఆందోళన చెందుతోంది. ఇప్పటికే ఈ వైరస్‌ సోకి అయిదు రోజులలో ఆరుగురు చిన్నారులు(Children) మరణించారు. ఈ వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య పన్నెండుకు చేరినట్లు ఆరోగ్య శాఖ మంత్రి రుషికేశ్‌ పటేల్‌ చెప్పారు. 12 మంది పేషంట్లలో నలుగురు సంబర్‌కాంత్‌ జిల్లాకు చెందిన వారు కాగా, ముగ్గురు ఆరావళి జిల్లాకు చెందినవారు. మహిసాగర్‌, ఖేడా జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. రాజస్తాన్‌కు చెందిన ఇద్దరు, మధ్యప్రదేశ్ ఒక్కరు ఈ వైరస్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం వీరంతా గుజరాత్‌లో చికిత్స పొందుతున్నారన్నారు. చాందిపురా వైరస్‌ అంటు వ్యాధి కాదని రుషికేశ్‌ పటేల్‌ పేర్కొన్నారు. అయితే, ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో నిఘా పెట్టామని, సుమారు 4,487 ఇళ్లలో 18,646 మంది వ్యక్తులను పరీక్షించామని చెప్పారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధక చర్యలు చేపట్టామని, ఆరోగ్య శాఖ 24 గంటలు పని చేస్తోందని మంత్రి తెలిపారు. పిల్లలకు వ్యాపించే ఈ వైరస్‌ను మొదట మహారాష్ట్రలోని చాందిపురా గ్రామంలో గుర్తించారు. ఈ వైరస్‌ సోకిన వారికి ఫ్లూ వంటి లక్షణాలతో జ్వరం వస్తుంది. తీవ్రమైన మెదడు వాపు కూడా కనిపిస్తుంది.

Eha Tv

Eha Tv

Next Story