మణిపూర్‌(Manipur) మండిపోతున్నది. గిరిజన గ్రూపులు చేస్తున్న ఆందోళన తీవ్ర స్థాయికి చేరుకుంది. ఫలితంగా ఎనిమిది జిల్లాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అల్లకల్లోలంగా ఉంది. హింస చెలరేగింది. ఫలితంగా ఎనిమిది జిల్లాలో కర్ఫ్యూ విధించారు.

మణిపూర్‌(Manipur) మండిపోతున్నది. గిరిజన గ్రూపులు చేస్తున్న ఆందోళన తీవ్ర స్థాయికి చేరుకుంది. ఫలితంగా ఎనిమిది జిల్లాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అల్లకల్లోలంగా ఉంది. హింస చెలరేగింది. ఫలితంగా ఎనిమిది జిల్లాలో కర్ఫ్యూ విధించారు. అయిదు రోజుల పాటు మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. అల్లర్లను అదుపు చేయడానికి భారత సైన్యం రంగంలోకి దిగింది. ఆర్మీతో పాటు అస్సాం రైఫిల్స్‌(Assam Rifles) దళాలు హింసాత్మక ప్రాంతాలలో పహారా కాస్తున్నాయి. మొయితీల గిరిజన హోదాకు సంబంధించి మణిపూర్‌ హైకోర్టు(Manipur High Court) ఇచ్చిన ఆదేశాలకు నిరసనగా చూరాచంద్‌పూర్‌లో గిరిజన గ్రూపులు ఓ యాత్ర చేపట్టాయి. అది హింసకు దారి తీసింది. అంతటా 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. చూరాచాంద్‌పూర్‌ జిల్లాలో ఆస్తులు, ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులు అంటున్నారు. బయట వ్యక్తులను ఎవరినీ రానివ్వడం లేదు.

మణిపూర్‌లో లోయ ప్రాంతాలలో ఉండే మెయితీలు తమను షెడ్యూల్డ్‌ ట్రైబ్‌ కేటగిరీలో చేర్చాలనే డిమాండ్‌ను మళ్లీ తెరపైకి తెచ్చారు. ఎస్టీ హోదాపై ఇటీవల కోర్టు తీర్పు ఇవ్వడాన్ని గిరిజనులు నిరసించారు. మెయితీల డిమాండ్‌ను వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో చురాచంద్ పూర్ జిల్లాలోని తొర్బంగ్ ప్రాంతంలో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ఏటీఎస్ యూఎం) గిరిజన సంఘీభావ యాత్ర చేపట్టింది. అరలక్ష మందికిపైగా గిరిజనులు ఒక్క చోట చేరారు. యాత్రలో పాల్గొన్న కొందరు గ్రామంలోని రోడ్లపై టైర్లు కాల్చారు. పోలీసులు రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు లాఠీలు, టియర్‌ గ్యాస్‌లు ప్రయోగించారు. ఈ హింసకు కారణం మెయితీలేనని గిరిజనసంఘాలు ఆరోపిస్తున్నాయి. కుకీ గిరిజనులే ఈ చర్యకు పాల్పడి తమపై నెపాన్ని నెట్టివేస్తున్నాయంటున్నారు మెయితీలు.

మణిపూర్‌లో లోయ ప్రాంతాల్లో మెయితీలుంటారు. కొండ ప్రాంతాల్లో నాగా, కుకీ చిన్‌ మిజో, జో వంటి గిరిజన తెగలు ఉన్నాయి. మణిపూర్‌ జనాభాలో సగం జనాభా మెయితీ తెగదే! తమను ఎస్టీ కేటగిరిలో చేర్చాలని, కొండ ప్రాంతాలలో ఆవాసం ఏర్పాటు చేయాలన్నది వీరి ప్రధాన డిమాండ్‌. ఈ డిమాండ్‌ ఇప్పటిది కాదు. దశాబ్దాల కాలం నుంచి వీరు ఈ డిమాండ్‌ను చేస్తున్నారు. పదేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం మెయితీలను గిరిజనుల్లో చేర్చే అంశాన్ని పరిశీలించేందుకు మణిపూర్‌ అసెంబ్లీ హిల్స్ ఏరియాస్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఏళ్ల తరబడి పరిశీలనలు చేసి చివరికి మెయితీలకు వ్యతిరేకంగా ఓ తీర్మానం చేసింది. దాంతో మెయితీల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీనిపై మణిపూర్‌ హైకోర్టును ఆశ్రయించారు. మెయితీలను ఎస్టీలో చేర్చే అంశాన్ని నాలుగు వారాల్లో పరిశీలించాని, కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించింది.. దీన్ని గిరిజనులు పూర్తిగా వ్యతిరేకించారు. ఇదే హింసకు దారి తీసింది. మణిపూర్‌ అట్టుడికిపోవడానికి కారణమయ్యింది.

Updated On 4 May 2023 5:29 AM GMT
Ehatv

Ehatv

Next Story