సోషల్ మీడియా(Social media) అప్పుడప్పుడు మంచి కూడా చేస్తుంది. విడిపోయిన అన్నాచెల్లెళ్లను(Sbilings) 18 ఏళ్ల తర్వాత కలిపింది.
సోషల్ మీడియా(Social media) అప్పుడప్పుడు మంచి కూడా చేస్తుంది. విడిపోయిన అన్నాచెల్లెళ్లను(Sbilings) 18 ఏళ్ల తర్వాత కలిపింది. బాలీవుడ్ సినిమా కథలా ఉన్న ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) కాన్పూర్(Kanpur) జిల్లాలో జరిగింది. ఫతేపూర్‌లోని ఇనాయత్‌పూర్ గ్రామానికి చెందిన బాలగోవింద్ అనే వ్యక్తి 2006లో పని వెతుక్కుంటూ ముంబాయికి(Mumbai) వెళ్లాడు. ఓ రోజున అతడు అనారోగ్యం పాలయ్యాడు. ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకుందమనుకుని రైలు ఎక్కాడు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరుకు బదులుగా రాజస్తాన్ రాజధాని జైపూర్‌కు వెళ్లాడు. ఆ రైల్వేస్టేషన్‌లో బాలగోవింద్‌కు ఓ వ్యక్తి పరిచయమయ్యాడ. ఆయన గోవింద్ ఆరోగ్యం మెరుగయ్యేంత వరకు చూసుకున్నాడు. తర్వాత అతడి ఫ్యాక్టరీలోనే కొలువిచ్చాడు. తదనంతరం అతడు జైపూర్‌లోనే స్థిరపడిపోయాడు. తన కుటుంబసభ్యులను, స్నేహితులను మర్చిపోయాడు. అక్కడే ఈశ్వర్ దేవిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇదిలా ఉంటే బాల గోవింద్ తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పోస్ట్ చేస్తుంటాడు. జైపూర్‌లో పలు ప్రాంతాలను తిరిగి రీల్స్ చేసేవాడు. ఇనాయత్‌పూర్‌లో ఉంటున్న రాజకుమారి అనే మహిళ ఆ రీల్స్‌ను చూసింది. అందులో ఒక రీల్‌లో అతడి విరిగిన పంటిని గమనించింది. వెంటనే అతడు చేసిన మరికొన్ని రీల్స్‌ను నిశితంగా పరిశీలించింది. అతడు చిన్నప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయిన సోదరుడు బాల గోవిందేనని నిర్ధారణకు వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే అతడిని సంప్రదించి వివరాలు రాబట్టింది. ఆ వివరాలతో వారిద్దరూ తోబుట్టువనే విషయం తేటతెల్లమయ్యింది. వెంటనే గోవింద్‌తో ఫోన్‌లో మాట్లాడింది. సొంత ఊరికి రావాలని రిక్వెస్ట్ చేసింది. జూన్ 20వ తేదీన గోవింద్ తన సొంత గ్రామానికి వచ్చాడు. చాన్నళ్లకు వచ్చిన సోదరుడిని చూసి రాజకుమారి ఆనందభాష్పాలు రాల్చింది.
గోవింద్ కూడా భావోద్వేగానికి లోనయ్యాడు.