ఓ కుటుంబంలో ఎన్ని ఓట్లు ఉంటాయి. మహా అయితే పదో పన్నెండో ఉంటాయి. అది కూడా ఉమ్మడి కుటుంబం అయితేనే! పాతిక నుంచి 30 ఓట్లు ఉండటం అన్నది చాలా చాలా అరుదు. కానీ అసోంలోని(Assam) సోనిట్‌పూర్(Sonitpur) జిల్లా నేపాలి పామ్ గ్రామంలో మాత్రం అలా కాదు.
ఓ కుటుంబంలో ఎన్ని ఓట్లు ఉంటాయి. మహా అయితే పదో పన్నెండో ఉంటాయి. అది కూడా ఉమ్మడి కుటుంబం అయితేనే! పాతిక నుంచి 30 ఓట్లు ఉండటం అన్నది చాలా చాలా అరుదు. కానీ అసోంలోని(Assam) సోనిట్‌పూర్(Sonitpur) జిల్లా నేపాలి పామ్ గ్రామంలో మాత్రం అలా కాదు. ఇక్కడ ఒకే కుటుంబంలో ఏకంగా 1200 మంది ఓటర్లు(Voter) ఉన్నారు. కరెక్టుగానే విన్నారు.. 1200 మంది ఓటర్లు ఉన్నారు కాబట్టే వారిని ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ నాయకులు గ్రామానికి తరలి వెళుతున్నారు. గ్రామంలో ఉన్న 300 కుటుంబాలు ఒకే వంశానికి చెందినవి కావడం విశేషం. వారంతా తారాన్ బహదూర్ తాపా వారసులు. ప్రస్తుతం వీరి సంఖ్య 2500 ఉంది. ఇందులో 1200 మంది ఓటర్లు ఉన్నారు. తారాన్ బహదూర్ తాపాకు(Taran Bahadur Tapa) అయిదుగురు భార్యలు.. 12 మంది కొడుకులు, పది మంది కూతుళ్లు ఉన్నారు. వారి సంతానమే వీరంతా!