బాలీవుడ్ వివాదాస్పద నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut) చెంపదెబ్బ రీసౌండ్ ఇంకా వినిపిస్తూనే ఉంది. కంగనా రనౌత్‌పై సీఐఎస్‌ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చేయి చేసుకున్న సంగతి విదితమే కదా! కంగనాను చెంపదెబ్బ కొట్టినందుకు ఆ మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్(Kulwinder Kaur)ను సస్పెండ్ చేశారు.
బాలీవుడ్ వివాదాస్పద నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut) చెంపదెబ్బ రీసౌండ్ ఇంకా వినిపిస్తూనే ఉంది. కంగనా రనౌత్‌పై సీఐఎస్‌ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చేయి చేసుకున్న సంగతి విదితమే కదా! కంగనాను చెంపదెబ్బ కొట్టినందుకు ఆ మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్(Kulwinder Kaur)ను సస్పెండ్ చేశారు. రైతుల ధర్నాను ఉద్దేశించి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకే ఆ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ లాగి ఒక్కటిచ్చుకుంది. ఈ విషయాన్ని కంగనా కూడా అంగీకరించింది. ప్రస్తుతం తాను సురక్షితంగానే ఉన్నానని, అయితే పంజాబ్(Punjab)లో పెరిగిపోతున్న ఉగ్రవాదులను ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ మళ్లీ ఓ కాంట్రవర్షియల్ స్టేట్‌మెంట్‌తో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ ఘటనపై అధికారులు మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయడంతో పాటు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కంగనాను కొట్టినందుకు చాలా మంది నెటిజన్లు కుల్వీందర్ సింగ్‌ను మెచ్చుకుంటున్నారు. కొందరు కుల్వీందర్‌నే తప్పుపడుతున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు విశాల్ దద్లానీ(Vishal Dadlani) రియాక్టయ్యారు. ఆ కానిస్టేబుల్‌కు మద్దతుగా నిలిచాడు. కుల్విందర్ కౌర్‌కు తాను ఉద్యోగం కల్పిస్తానని సింగర్ విశాల్ దద్లానీ హామీ ఇచ్చాడు. కుల్విందర్ కౌర్ ఒప్పుకుంటే తగిన ఉద్యోగం ఇస్తానని చెప్పారు. తాను హింసకు ఎప్పుడూ వ్యతిరేకినేనని. కానీ ఆమె కోపాన్ని నేను కచ్చితంగా అర్థం చేసుకున్నానని విశాల్ చెప్పారు. సీఐఎస్‌ఎఫ్ ఆమెపై చర్యలు తీసుకున్నట్లయితే ఆమెకు ఉద్యోగం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నా జై హింద్. జై జవాన్. జై కిసాన్ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఎవరైనా మీ తల్లిని 100 రూపాయలకు అందుబాటులో ఉందని కామెంట్ చేస్తే ఏం చేస్తారు? అని విశాల్ ప్రశ్నించారు. గతంలో కంగనా రైతుల ధర్నాను ఉద్దేశించి 100 రూపాయల కోసం వచ్చారంటూ కామెంట్స్ చేసింది. ఒకప్పుడు బిల్కిస్ బానో(Bilkis Bano) విషయంలోనూ కంగనా చేసిన పోస్టును విశాల్ షేర్ చేశాడు.